Jailer 2 : 'జైలర్ 2' లోడింగ్.. అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

రజినీకాంత్ 'జైలర్' మూవీకి సీక్వెల్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్ కి సంబంధించి డైరెక్టర్ నెల్సన్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. స్క్రిప్ట్ అంతా ఫైనల్ అయిపోయింది. ప్రొడక్షన్‌ హౌజ్‌ త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తుందని అన్నాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

New Update
Jailer 2 : 'జైలర్ 2' లోడింగ్.. అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

Rajinikanth's Jailer 2 : కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది నటించిన 'జైలర్' సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రజినికాంత్ కి భారీ కంబ్యాక్ ఇచ్చింది. ఇక ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తీస్తున్నారు.

డైరెక్టర్ నెల్సన్ ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సీక్వెల్ కి సంబంధించి డైరెక్టర్ నెల్సన్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఇటీవలే ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో నెల్సన్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. అంతా ఫైనల్ అయిపోయింది.. ప్రొడక్షన్‌ హౌజ్‌ సన్‌ పిక్చర్స్‌ అధికారిక ప్రకటన చేస్తుందని అన్నాడు.

Also Read : యూట్యూబ్ ను షేక్ చేస్తున్న’దేవర’ సాంగ్.. నెల తిరక్కముందే అన్ని కోట్ల వ్యూసా?

దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ సినిమాకు 'హుకుం' అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే టైటిల్ అనౌన్స్ మెంట్ కూడా ఉండొచ్చనే టాక్ వినిపిస్తుంది.

Advertisment
తాజా కథనాలు