TSPSC: గ్రూప్-2 వాయిదా.. ఏ క్షణమైనా నిర్ణయం?

టీఎస్పీఎస్సీ ఉద్యోగార్థుల నిరీక్షణకు ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్‌-2 పరీక్షపై సందిగ్ధం నెలకొంది. ఇంకా పదిరోజులే మిగిలున్నప్పటికీ పరీక్ష నిర్వహణ కోసం కమిషన్ ఏర్పాట్లేవీ చేయకపోవడంతో మరోసారి వాయిదా పడే అవకాశాలే కనిపిస్తున్నాయి.

TSPSC: గ్రూప్-2 వాయిదా.. ఏ క్షణమైనా నిర్ణయం?
New Update

TSPSC Group 2: టీఎస్పీఎస్సీ ఉద్యోగార్థుల నిరీక్షణకు ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. షెడ్యూలు ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్‌-2 పరీక్షపై సందిగ్ధం నెలకొంది. నెల క్రితం పరీక్ష కేంద్రాలను సిద్ధం చేయడం కోసం ప్రకటన జారీచేసిన టీఎస్‌పీఎస్సీ (TSPSC), పరీక్షకు ఇంకా పదిరోజులే మిగిలున్నప్పటికీ ఏర్పాట్లేవీ చేయకపోవడం చర్చనీయంగా మారింది. దీంతో మరోసారి గ్రూప్‌-2 వాయిదా పడే అవకాశాలే కనిపిస్తున్నాయి.

పేపర్‌ లీకేజీ, అనంతర పరిణామాలతో పరీక్షల రద్దు, వరుస వాయిదాలు అభ్యర్థులను తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనుచేశాయి. ఇక రాష్ట్రంలో రెండో అత్యున్నత పోస్టుగా భావించే గ్రూప్‌-2 పరీక్ష కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఏళ్ల తరబడి సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం వెలువడిన రెండో గ్రూప్‌ -2 నోటిఫికేషన్‌ ఇది. 783 పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువడగా దాదాపు 5.50లక్షల మంది దరఖాస్తు చేశారు. దాదాపు ఏడేళ్ల అనంతరం వెలువడిన నోటిఫికేషన్‌ కావడంతో అభ్యర్థులు దీన్ని ప్రతిష్ఠాత్మకంగా భావించి లైబ్రరీలకే పరిమితమై సన్నద్ధమవుతున్నారు. అయితే, వరుస వాయిదాలు వారిని గందరగోళానికి గురిచేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. ప్రధానితో మీటింగ్ తో పాటు సీఎం షెడ్యూల్ ఇదే!

మొదట జూన్‌లో పరీక్ష నిర్ణయించాలని కమిషన్‌ నిర్ణయించింది. అయితే, రద్దయిన గ్రూప్‌-1 పరీక్ష జూన్‌ 11నే ఉండడంతో అంత తక్కువ వ్యవధిలో మరో పరీక్షకు సిద్ధం కాలేమన్న అభ్యర్థులు విన్నవించిన నేపథ్యంలో ఆగష్టు 29, 30 తేదీల్లో నిర్వహించాలని భావించారు. అయితే, అప్పుడు గురుకుల నియామకాలు, జేఎల్‌ (JL) పరీక్షలు వరుసగా ఉండడంతో అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో మరోసారి నవంబర్‌కు వాయిదా వేశారు. అయితే, అప్పటికి ఎన్నికల సందడి మొదలై పరీక్ష జనవరి 6, 7 తేదీలకు మరోసారి వాయిదా పడింది.

కొత్త ప్రభుత్వంలో పాత నోటిఫికేషన్లపై ఇంకా అభ్యర్థులకు స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా, దాదాపు నెల క్రితం గ్రూప్‌-2 పరీక్ష కోసం సెంటర్లను సిద్ధం చేయడానికి టీఎస్‌పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. దీంతో పరీక్ష జరిగే అవకాశముందని అభ్యర్థులు భావించారు. కానీ, ఆలోగానే టీఎస్‌పీఎస్సీ సభ్యులు రాజీనామాలు సమర్పించారు. ఇటీవలే ఉద్యోగ భర్తీ ప్రక్రియపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష, టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యుల రాజీనామా, యూపీఎస్సీ సహా ఇతర బోర్డుల పనితీరుపై అధ్యయనం చేసేలా కమిటీ కోసం సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం.. తదితర పరిణామాల నేపథ్యంలో గతంలో రెండు సార్లు వాయిదా పడిన గ్రూప్‌ -2 పరీక్ష మరోసారి పోస్ట్‌పోన్‌ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారాలన్నీ లక్షలాది మంది ఆశావహుల ఉత్సాహాన్ని నీరుగార్చేలా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: డిసెంబర్‌లోనే కొత్త వేరియంట్లు ఎందుకు వ్యాప్తి చెందుతాయి? కరోనాతో ఈ నెలకు ఉన్న బంధమేంటి?

మరోవైపు ఎన్నికల్లో జాబ్‌ క్యాలెండర్‌ (Job Calender) ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ (Congress) ఆ హామీ అమలు దిశగా ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తుందో చూడాల్సి ఉంది. మొత్తానికి టీఎస్‌పీఎస్సీకి కొత్త బోర్డు ఏర్పాటు అనంతరమే నియామక పరీక్షలు ముందుకెళ్లే అవకాశముందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇది కూడా చదవండి: కేవలం రూ.202తో 13 OTTలు.. వోడాఫోన్ ఐడియా సంచలన న్యూఇయర్ ఆఫర్!

#tspsc-group-2-exam #tspsc-group-2 #tspsc
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe