DigiYatra: మార్చి 31 నుంచి చెన్నై విమానాశ్రయంలో డిజి యాత్ర సదుపాయం ప్రారంభం!

విమాన ప్రయాణాన్ని సులభతరం చేసే డిజి యాత్రా యాప్ సౌకర్యం మరికొద్ది రోజుల్లో చెన్నై విమానాశ్రయంలో కూడా ప్రారంభం కాబోతుంది. మార్చి 31 నుంచి ఈ సౌకర్యం చెన్నై విమానాశ్రయంలో అందుబాటులోకి రానున్నట్లు పౌరవిమానయాన మంత్రిత్వశాఖ వివరించింది.

New Update
DigiYatra: మార్చి 31 నుంచి చెన్నై విమానాశ్రయంలో డిజి యాత్ర సదుపాయం ప్రారంభం!

Chennai Airport to Join DigiYatra: విమాన ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే డిజి యాత్రా (DigiYatra) సౌకర్యం మరికొద్ది రోజుల్లో చెన్నై విమానాశ్రయంలో కూడా ప్రారంభం కాబోతుంది. మార్చి 31 నుంచి ఈ సౌకర్యం చెన్నై విమానాశ్రయంలో అందుబాటులోకి రానున్నట్లు పౌరవిమానయాన మంత్రిత్వశాఖ వివరించింది. ప్రస్తుతం దేశంలోని 13 విమానాశ్రయాల్లో ఈ డిజియాత్ర సౌకర్యం అందుబాటులో ఉంది.

డిజియాత్ర సౌకర్యాన్న 2022 డిసెంబర్‌ లో ప్రారంభించారు. ఇది ఫేషియల్ రికగ్నైజేషన్‌ టెక్నాలజీ ఆధారంగా విమానాశ్రయంలోని వివిధ చెక్ పాయింట్లలో ఇది ప్రయాణికుల కాగిత రహిత ప్రయాణ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా ఏర్పాటు చేయడం జరిగింది.

డిజియాత్ర యాప్ వినియోగదారుల సంఖ్య...

డిజి యాత్ర యాప్ (DigiYatra APP) వినియోగదారుల సంఖ్య 45.8 లక్షలు దాటింది. డిజి యాత్ర యాప్ ద్వారా ప్రయాణిస్తున్న ప్రయాణికుల సంఖ్య 1.45 కోట్లకు చేరుకుంది. డిజి యాత్ర మార్చి 31, 2024 నాటికి చెన్నై విమానాశ్రయంలో కూడా ప్రారంభం కానుందని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 10, 2024 నాటికి తమ మొబైల్ ఫోన్‌లలో డిజి యాత్ర అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకునే ప్రయాణికుల సంఖ్య 45.8 లక్షలకు పెరిగింది. జనవరి 1, 2024 నాటికి ఈ సంఖ్య 38 లక్షలుగా ఉంది.

ఈ ఏడాది మరో 25 విమానాశ్రయాల్లో 

గత డిసెంబర్‌లో పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) మాట్లాడుతూ 2024లో దేశంలోని మరో 25 విమానాశ్రయాల్లో డిజి యాత్ర సౌకర్యాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. 'డిజి యాత్ర'ను ప్రోత్సహించాలని విమానాశ్రయ నిర్వాహకులను కోరారు. డిజి యాత్రను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే.. విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి పొడవైన క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఎవరికీ ID రుజువును చూపించాల్సిన అవసరం లేదు.

Digi Yatra యాప్ ప్రయాణీకుల బోర్డింగ్ పాస్‌ను ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS)తో కలుపుతుంది. ఇది వారి గుర్తింపును నిర్ధారిస్తుంది. ఇది బోర్డింగ్ గేట్‌ను చేరుకోవడానికి, ముందస్తు భద్రతా తనిఖీలను పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని తగ్గిస్తుంది. డిజి యాత్ర యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, ప్రయాణీకుడు డిజి యాత్ర ఐడిని సృష్టించాలి. ప్రయాణికులు తమ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామా, వారి గుర్తింపు రుజువు వివరాల సహాయంతో డిజి యాత్ర IDని సృష్టించవచ్చు.

Also Read: ఈ కూరగాయలలో మాంసం కంటే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి…

Advertisment
Advertisment
తాజా కథనాలు