MP Anuradha: అమలాపురంలో ఎంపీ అనురాధ వర్సెస్ మంత్రి విశ్వరూప్.. బయటపడ్డ వర్గ విభేదాలు..!

అమలాపురం ఎంపీ అనురాధ.. మంత్రి విశ్వరూప్ మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీ అనురాధకు మైక్ ఇవ్వకుండానే సభను ముగించారు మంత్రి విశ్వరూప్. మంత్రి వ్యవహారంతో తీవ్ర అసంతృప్తికి లోనైన అనురాధ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

New Update
MP Anuradha: అమలాపురంలో ఎంపీ అనురాధ వర్సెస్ మంత్రి విశ్వరూప్.. బయటపడ్డ వర్గ విభేదాలు..!

 MP Chinta Anuradha: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. ఎంపీ చింతా అనురాధని పోమ్మన్న లేక పొగ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఎంపీ అనూరాధను టార్గెట్ గా చేసుకుని వైసీపీ నేతలు ఎత్తుగడలు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీ నేతలే అవమానపరిచారు. నిన్న పి.గన్నవరం సమీక్ష సమావేశంలో ఎంపీ చింతా అనూరాధ స్టేజ్‌ పై ఉండగానే.. ఈ సారి ఎంపీగా తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు రాజోలు ఎమ్మెల్యే రపాక. దీంతో స్టేజ్‌ పైనే మౌనంగా ఉండిపోయారు ఎంపీ అనురాధ.

Also Read: వార్నీ.. 217 సార్లు కరోనా టీకా వేయించుకున్నాడు.. చివరికి

ఇదిలా ఉండగా.. నిన్న సాయంత్రం అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే దివంగత నేత కుడిపూడి చిట్టబ్బాయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనురాధకు మైక్ ఇవ్వకుండా అవమానించారు మంత్రి పినిపే విశ్వరూప్. విగ్రహ ఏర్పాటుకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన అనురాధకు కనీసం మైక్ ఇవ్వనట్లు తెలుస్తోంది. ఇలా రెండు చోట్లు అవమానం జరగడంతో వైసీపీ నేతలపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Also Read: రైతులకు జగన్‌ అదిరిపోయే గిఫ్ట్‌.. ఇవాళ అన్నదాతల ఖాతాలలో డబ్బులు జమ!

ఇలా రోజు రోజుకు కోనసీమ జిల్లాలో వైసీపీ పార్టీ నేతల మద్య అంతర్గత విబేధాలు బయటపడుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిధున్ రెడ్డి ఎదుటే ఎంపీ అనురాధను అవమానించడంపై ఆమె అనుచరులు మండిపడుతున్నారు. మహిళా ఎంపీని పట్టుకుని ఇంతలా అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నకాక మొన్న పార్టీలోకి వచ్చిన గొల్లపల్లికి కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి స్థానిక ఎంపీకి మైక్ ఇవ్వకపోవడం సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు