విజయశాంతి బీజేపీలోనుంచి వెళ్లిపోయినందుకు పీడపోయిందని షాకింగ్ కామెంట్స్ చేశారు నిజామాబాద్ ఎంపి అర్వింద్ . ప్రజల్లో ఉన్నవాళ్లంతా బీజేపీలోనే ఉన్నారన్న అర్వింద్ ...పాపులారిటీ లేకుండా రాజకీయాలు చేసేవారే ఇతర పార్టీల్లోకి వెళ్తారంటూ విజయశాంతికి కౌంటర్ ఇచ్చారు. విజయశాంతి పార్టీ వదిలినంత మాత్రాన పార్టీకి ఏమాత్రం ఇబ్బంది లేదన్నారు. అసలు ఆమెకు ఫాలోయింగే లేదంటూ కామెంట్స్ చేశారు.
ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలకు విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. వ్యక్తులను విమర్శించే సంస్కారం మాకు అటల్ జీ అద్వానీజీ, నా బీజేపీ నేర్పలేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని ఇయ్యాల ...తెలంగాణ సమాజం అంటున్నది. అందుకు సమాధానం చెప్తే సమంజసం కావచ్చు ఎంతో కొంతైనా... నన్ను బాధపెట్టే మాటలతో విమర్శించే కన్నా...అంటూ అర్వింద్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు విజయశాంతి.
ఇది కూడా చదవండి : లేడీస్, మీ భర్త మీ మాట అస్సలు వినకపోతే, ఈ చిట్కాలు ప్రయత్నించండి..!!