Chandrababu: ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దు.. డీజీపీకి చంద్రబాబు ఆదేశం..!

సీఎం చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమల రావు భేటీ అయ్యారు. బాపట్ల జిల్లా ఈపూరుపాలెం యువతి హత్య ఘటనపై ప్రాధమిక సమాచారాన్ని సీఎంకి వివరించారు. దోషులకు వెంటనే కఠిన శిక్ష పడేలా చూడాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీకి సీఎం స్పష్టం చేశారు.

New Update
Ap Cabinet : నేడు తొలిసారి సమావేశం కానున్న ఏపీ కేబినేట్!

CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమల రావు భేటీ అయ్యారు. బాపట్ల జిల్లా ఈపూరుపాలెం యువతి దారుణ హత్య ఘటనపై ప్రాధమిక సమాచారాన్ని సీఎంకి వివరించారు డీజీపీ. ఈపూరుపాలెం ఘటనలో దోషులకు వెెెంటనే కఠిన శిక్ష పడేలా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

Also Read: యువతి దారుణ హత్య.. సీరియస్ గా స్పందించిన ప్రభుత్వం..!

త్వరలోనే పోలీస్ యంత్రాంగం ప్రక్షాళన ఉంటుందని డీజీపీకి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతన్నారు. మహిళల రక్షణకు హై ప్రయార్టీ ఇవ్వాలని డీజీపీకి సీఎం సూచించారు.

Advertisment
తాజా కథనాలు