Pawan Kalyan: పవన్ చాంబర్‌పై కొనసాగుతున్న కసరత్తు.. గతంకంటే భిన్నంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు.!

ఏపీ సెక్రటేరియట్‌లో పవన్ చాంబర్‌పై కసరత్తు కొనసాగుతుంది. పవన్‌కు ఇంపార్టెన్స్ తగ్గకుండా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. తన బ్లాక్‌లోనే పవన్‌కు ఒక ప్రత్యేక చాంబర్ కేటాయించాలని ఆయన భావిస్తున్నారు. పవన్ కోసం గతంకంటే చంద్రబాబు భిన్నంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

New Update
Pawan Kalyan: పవన్ చాంబర్‌పై కొనసాగుతున్న కసరత్తు.. గతంకంటే భిన్నంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు.!

Deputy CM Pawan Kalyan : డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాంబర్‌ కోసం సెక్రటేరియట్‌లో కసరత్తు కొనసాగుతుంది. పవన్‌కు ఏ మాత్రం  ఇంపార్టెన్స్ తగ్గకుండా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. తన బ్లాక్‌లోనే పవన్‌కు ఒక ప్రత్యేక చాంబర్ కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. పవన్‌కు హై సెక్యూరిటీ ఉంటున్న నేపథ్యంలో మొదటి బ్లాకులోనే కేటాయించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: పుంగనూరులో హైటెన్షన్.. మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ

అయితే, గతంలో డిప్యూటీ సీఎం, మంత్రులకు  2, 3, 4, 5 బ్లాక్‌లలో చాంబర్లు ఏర్పాటు చేశారు. సీఎం, సీఎస్‌లకు మాత్రమే మొదటి బ్లాక్‌లో చాంబర్‌ ఉండేది. అయితే, పవన్ కోసం గతంకంటే కూడా చంద్రబాబు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. గతంలో RTGSకు ప్రత్యేకంగా గదిని రూపొందించుకున్న చంద్రబాబు.. ఇప్పుడు తన గదినే పవన్‌కి కేటాయించే అవకాశం కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు