Trains Delay: పొగమంచు ఎఫెక్ట్.. 30 రైళ్లు ఆలస్యం.. లిస్ట్‌ ఇదే!

దృశ్యమానత, ఎముకలు కొరికే చలి, దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీతో పాటు దాని చుట్టుపక్కల 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలో అనేక మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. పూర్తి లిస్ట్‌ కోసం ఆర్టికల్‌ను చదవండి.

New Update
Trains Delay: పొగమంచు ఎఫెక్ట్.. 30 రైళ్లు ఆలస్యం.. లిస్ట్‌ ఇదే!

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)ని చలి వణికిస్తోంది. ఢిల్లీతో పాటు చాలా ఉత్తరాది రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. తీవ్రమైన చలితో రైలు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పొగమంచుతో పాటు తక్కువ దృశ్యమానత కారణంగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైలు ప్రయాణాల్లో గణనీయమైన జాప్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ వారం దట్టమైన పొగమంచు కారణంగా పలు విమానాల రాకపోకలు ప్రభావితమయ్యాయి. పొగమంచుతో కూడిన చలిగాలులు నగరంలో కొనసాగుతుండడంతో ఇవాళ(జనవరి 16) ఢిల్లీతో పాటు చుట్టుపక్కల 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలో అనేక మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు.

ఢిల్లీ ప్రాంతంలో ఆలస్యం అయిన రైళ్ల పూర్తి జాబితాను కింద చెక్‌చేసుకోండి.


రానున్న మూడు రోజుల పాటు కోల్డ్‌వేవ్‌ పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. రాజధానికి ప్రయాణం సాఫీగా సాగుతుందని ఆశించే ప్రయాణీకులకు ఇది ఇబ్బందే. చాలా ట్రైన్స్‌ 30 నిమిషాల నుంచి 6 గంటల ఆలస్యంతో నడుస్తున్నాయి. జనవరి 21 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. అటు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరే దాదాపు 30 విమానాలు ఆలస్యం అయ్యాయి. గడ్డకట్టే చలి కారణంగా మరో 17 విమానాలు రద్దు చేశారు.

ALSO READ: ఆ హీరో మాట సాయం చేస్తే.. సినిమా నెక్స్ట్ లెవెల్ గ్యారెంటీ..

WATCH:

Advertisment
తాజా కథనాలు