DU Law Admission 2023: ఢిల్లీ యూనివర్సిటీలో లా అడ్మిషన్స్ ప్రారంభం.. ఇలా అప్లై చేసుకోండి..

లాయర్ అవ్వాలని మీ కలా? ఇందుకోసం లా చేయాలని భావిస్తున్నారా? అయితే, మీకోసమే ఈ శుభవార్త. ఢిల్లీ యూనివర్సిటీలో లా అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. లా అడ్మిషన్ 2023 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది యూనివర్సిటీ.

New Update
DU Law Admission 2023: ఢిల్లీ యూనివర్సిటీలో లా అడ్మిషన్స్ ప్రారంభం.. ఇలా అప్లై చేసుకోండి..

DU Law Admission 2023 Registrations: లాయర్ అవ్వాలని మీ కలా? ఇందుకోసం లా చేయాలని భావిస్తున్నారా? అయితే, మీకోసమే ఈ శుభవార్త. ఢిల్లీ యూనివర్సిటీలో లా అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. లా అడ్మిషన్ 2023 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది యూనివర్సిటీ. అసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ (law.uod.ac.in) సందర్శించి అప్లై చేసుకోవచ్చు. బీఏ ఎల్ఎల్‌బి, బీబీఏ ఎల్‌ఎల్‌బి కోర్సుల కోసం అప్లికేషన్స్ ప్రారంభమయ్యాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభయర్థులు కింద పేర్కొన్న దశల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

డీయూ లా అడ్మిషన్ 2023 రిజిస్ట్రేషన్ అర్హతలు..

ఢిల్లీ యూనివర్సిటీలో లా అడ్మిషన్ పొందాలనుకుంటే.. ఏదైనా గుర్తింపు పొంది. బోర్డు నుంచి ప్లస్ 12 ఉత్తీర్ణులై ఉండాలి. బీఏ ఎల్‌ఎల్‌బి(ఆనర్స్), బీబీఏ ఎల్‌ఎల్‌బి(ఆనర్స్)లో రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థి తప్పనిసరిగా UR/EWS/OBC-NCL కేటగిరీ వారు 45% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు, SC/ST/PWBD వారైతే 40% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొంది ఉండాలి. ఇక అభ్యర్థులు CLAT-2023 పరీక్ష రాసి ఉండాలి.

ఫీజు ఎంత?

ఈ అప్లికేషన్ కోసం అభ్యర్థులు జనరల్/OBC-NCL/EWS కేటగిరీకి రూ. 1500 ఫీజు చెల్లించాలి. అయితే SC/ST/PWBD కేటగిరీ అభ్యర్థులకు ఫీజు రూ. 1,000గా ఫీజు నిర్ణయించడం జరిగింది. ఈ ఫీజు చెల్లింపులు ఆన్‌లైన్ మోడ్‌లో జరపాల్సి ఉంటుంది.

డీయూ లా అడ్మిషన్ 2023 రిజిస్ట్రేషన్ దరఖాస్తు ఎలా?

⇒ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అభ్యర్థులు DU Law law.uod.ac.in అధికారిక సైట్‌ని సందర్శించాలి.

⇒ ఆ తర్వాత అభ్యర్థులు తమ పేరును నమోదు చేసుకోవాలి.

⇒ ఆ తర్వాత అభ్యర్థి లాగిన్ వివరాలను నమోదు చేయాలి.

⇒ ఆ తర్వాత అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

⇒ ఇదంతా పూర్తయిన తరువాత అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

⇒ అప్లికేషన్ పూర్తయిన తరువాత అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

⇒ చివరగా అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ హార్డ్ కాపీని తీసి, తదుపరి అవసరాల కోసం తమ వద్ద ఉంచుకోవాలి.

Also Read:

Nara Lokesh: స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేష్ కు స్వల్ప ఊరట.. హైకోర్టు కీలక ఆదేశాలు

Vishal: సెన్సార్ బోర్డుపై హీరో విశాల్ చేసిన కామెంట్స్ వైరల్.. కేంద్ర ప్రభుత్వం సీరియస్..!

Advertisment
తాజా కథనాలు