VIRAL VIDEO: పెట్రోల్‌ బంక్‌లో తుపాకీ తూటాల మోత.. ఈ రేంజ్‌లో దొంగతనం చేయడం ఏంటి భయ్యా?

ఆరుగురు దొంగలు.. పాయింట్‌ బ్లాంక్‌లో తుపాకీ పెట్టి డబ్బులు దోచుకున్నారు. ఢిల్లీ ముండ్కా ఘేవ్రా మోడ్ పెట్రోల్ బంక్‌ దగ్గర జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆరుగురు దుండగులు పెట్రోల్‌ బంక్‌ ఉద్యోగిపై దాడికి దిగారు. అతని దగ్గర నుంచి వేలాది రూపాయలు కాజేసి పారిపోయారు. ఆ సమయంలో పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది బారికేడ్స్‌ అడ్డుపెట్టేందుకు యత్నించడంతో రెండు రౌండ్ల కాల్పులు కూడా జరిపారు.

New Update
VIRAL VIDEO: పెట్రోల్‌ బంక్‌లో తుపాకీ తూటాల మోత.. ఈ రేంజ్‌లో దొంగతనం చేయడం ఏంటి భయ్యా?

Delhi petrol bunk robbery: సిటీల్లో అర్థరాత్రి దాటిన తర్వాత కూడా బయటకు వచ్చే జనాలు ఉంటారు. నిజానికి సిటీల్లో రాత్రి సైలెంట్‌గా ఉండదు. కొన్నిసార్లు ట్రాఫిక్‌జామ్‌లు కూడా అయ్యే ఛాన్స్‌లు ఉంటాయి. అందుకే పెట్రోల్‌ బంకులు కూడా కొన్ని ప్రాంతాల్లో రాత్రి తెరిచే ఉంటాయి. అయితే దొంగలు మాత్రం అసలు భయపడే రకం కాదు. పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగడం.. అందినకాడికి దోచుకోని పారిపోవడం వారికి అలవాటు. పారిపోయే క్రమంలో ఎవరైనా అడ్డు వస్తే చంపడానికి కూడా వెనకాడరు చాలా మంది. పెద్ద పెద్ద ఇళ్లలో టైట్‌ సెక్యూరిటీ ఉంటుంది. అందుకే అక్కడ దోచుకోవడం కష్టమని భావిస్తున్న దొంగలు ఇటివలి కాలంలో మధ్యతరగతి వాళ్లు, పొట్టకూటి కోసం పని చేసుకుంటున్న వారిపై ప్రతాపం చూపిస్తున్నారు. ఆటో డ్రైవర్లు, రోడ్డు పక్కన చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారిని సైతం వదలడం లేదు. ఇక పెట్రోల్‌ బంక్‌ సిబ్బందిపై దాడి చేసి అతని దగ్గర ఉన్న క్యాష్‌ తీసుకోని పరార్‌ అయ్యే దొంగల సంఖ్య ఇటివలి కాలంలో బాగా పెరిగింది. ముఖ్యంగా ఢిల్లీ లాంటి సిటీల్లో ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.

దాడి చేసి దోపిడి చేశారు:
ఢిల్లీ(Delhi)లో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. సినిమా ఫక్కీలో దోపిడీలకు పాల్పడుతున్నారు. నిన్న ఆటో డ్రైవర్‌ను దోచుకొని చంపేసిన ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ముండ్కా ఘేవ్రా మోడ్ పెట్రోల్ బంక్‌ దగ్గర జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఒక్కరు..ఇద్దరు కాదు. ఏకంగా ఆరుగురు దుండగులు పెట్రోల్‌ బంక్‌ ఉద్యోగిపై దాడికి దిగారు. బైక్‌లపై ముసుగులు ధరించి వచ్చిన ఆగంతకులు ముందు పెట్రోల్‌ నింపమని అడిగారు. పెట్రోల్‌ కొట్టే ప్రయత్నంలో ఉన్న యువకుడికి పాయింట్‌ బ్లాంక్‌లో తుపాకీ గురి పెట్టి..తలపై బాది అతని దగ్గరున్న వేల రూపాయలు దోచుకెళ్లారు.

ఆ సమయంలో పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది బారికేడ్స్‌ అడ్డుపెట్టేందుకు యత్నించడంతో రెండు రౌండ్ల కాల్పులు కూడా జరిపారు. ఆ తర్వాత దోచుకున్న సొమ్ముతో పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్‌ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఢిల్లీలోని పెట్రోల్ పంప్‌లో బైక్‌పై వచ్చిన కొందరు దుండగులు పంపు చుట్టూ కాల్పులు జరిపి అందులోని ఉద్యోగి సుమారు రూ.12,000 దోచుకున్నారు. అర్థరాత్రి జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనలో పెట్రోల్ పంప్ ఉద్యోగి ఒకరు గాయపడ్డారు.

ALSO READ: ఆ నగరంలో ఎక్కడ చూసినా శవాల కుప్పలు.. పసిపిల్లలను కూడా వదలని మిలిటెంట్లు!

Advertisment
Advertisment
తాజా కథనాలు