ప్లే ఆఫ్స్ ఛాన్స్ ను మిస్ చేసుకున్న డిల్లీ క్యాపిటల్స్!

ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆరో విజయాన్ని సాధించింది. దీంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో రెండో ప్లేసును పదిలం చేసుకుంది. ఈ ఓటమితో రెండో స్థానానికి చేరే అవకాశాన్ని ఢిల్లీ చేజార్చుకుంది. ఆ జట్టు ప్రస్తుతం 11 మ్యాచుల్లో 5 విజయాలతో ఆరో స్థానంలో నిలిచింది.

ప్లే ఆఫ్స్ ఛాన్స్ ను మిస్ చేసుకున్న డిల్లీ క్యాపిటల్స్!
New Update

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆరో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో 7 వికెట్లు తేడాతో గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని మరింత పదిలం చేసుకుని.. ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. కేకేఆర్ బౌలర్ల ధాటికి 153/9 పరుగులకు పరిమితమైంది. అనంతరం కేకేఆర్.. 16.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిలిప్ సాల్ట్‌లు అదిరే ఆరంభం ఇచ్చారు. ఎడాపెడా సిక్స్‌లు, ఫోర్లు కొట్టడంతో ఆ జట్టు పవర్ ప్లే ముగిసే సరికి 79/0తో నిలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. ఫిలిప్ సాల్ట్ 33 బంతుల్లో 68 పరుగులు చేశాడు. సునీల్ నరైన్ (15), శ్రేయస్ అయ్యర్ (23 బంతుల్లో 33 రన్స్), వెంకటేశ్ అయ్యర్ (23 బంతుల్లో 26 రన్స్) రాణించారు. దీంతో కేకేఆర్ 16.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 153/9 పరుగులకే పరిమితమైంది. పృథ్విషా (13), జేక్ ఫ్రెజర్ మెక్ గుర్క్ (12), షై హోప్ (6)లు స్వల్ప స్కోరుకే ఔట్ కావడంతో 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అభిషేక్ పోరెల్ (18), రిషభ్ పంత్ (27) కాసేపు నిలబడటంతో 10 ఓవర్లలో 93/4తో కోలుకున్నట్లే కనిపించింది. కానీ పంత్ ఔట్ అయిన తర్వాత ఆ జట్టు పతనం వేగంగా సాగింది. అక్షర్ పటేల్ (15), ట్రిస్టన్ స్టబ్స్ (4) స్వల్ప స్కోరుకే ఔట్ అయ్యారు. దీంతో 111/8తో నిలిచిన ఢిల్లీ పూర్తి ఓవర్లు కూడా ఆటకుండా ఆలౌట్ అవుతుందా అనిపించింది.

కానీ సాధారణంగా బంతితో రాణించే కుల్‌దీప్ యాదవ్ ఈ మ్యాచులో బ్యాటుతోనూ సత్తాచాటాడు. కీలక సమయంలో 26 బంతుల్లో 35 రన్స్ చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 153/9 చేసింది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, వైభవ్ అరోరా 2, హర్షిత్ రాణా 2, మిచెల్ స్టార్క్ 1, సునీల్ నరైన్ 1 వికెట్ తీశారుకాగా ఈ మ్యాచుకు ముందు వరకు 10 మ్యాచుల్లో ఐదింట్లో గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆరో ప్లేసులో నిలిచింది. కేకేఆర్‌పై గెలిచి ఉంటే.. ఏకంగా రెండో స్థానానికి చేరేది. కానీ ఈ ఓటమితో ఆరో స్థానంలోనే కొనసాగుతోంది. ఇక కేకేఆర్.. 9 మ్యాచుల్లో 6 విజయాలతో దాదాపుగా ప్లే ఆఫ్స్‌కు చేరువైంది.

#ipl2024 #kkr-vs-dc
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe