ANI vs Wikipedia: వికీపీడియాకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ అయ్యాయి. ANI వికీపీడియా పేజీలో సవరణలు చేసిన వ్యక్తుల సమాచారాన్ని బహిర్గతం చేయాలని గతంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలను పాటించనందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం వికీపీడియాకు కోర్టు ధిక్కార నోటీసును జారీ చేసింది. బార్ అండ్ బెంచ్ ఈ విషయాన్ని తన X పోస్ట్ ద్వారా వెల్లడించింది.
ANI vs Wikipedia: ‘మీకు ఇండియా నచ్చకపోతే దయచేసి భారత్‌లో పని చేయకండి.. భారత్‌లో వికీపీడియాను బ్లాక్ చేయమని ప్రభుత్వాన్ని కోరతాం’ అని ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ పోస్ట్ లో బార్ అండ్ బెంచ్ తెలిపింది. వికీపీడియా అధికారిక ప్రతినిధిని అక్టోబర్ 25న కోర్టులో వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఆరోజు జరుగుతుంది.
ఏం జరిగింది?
ANI vs Wikipedia: వార్తా సంస్థ ANI మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పరువు నష్టం కలిగించేలా తన కంటెంట్ లో మార్పు చేసినట్టు ఢిల్లీ హైకోర్టులో వికీపీడియాపై దావా వేసింది. ప్లాట్‌ఫారమ్‌లోని తమ వార్తా సంస్థ పేజీలో పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించకుండా వికీపీడియాను నిరోధించాలని ANI కోరింది. కంటెంట్‌ను తీసివేయాలని కూడా ఏజెన్సీ కోరింది. అంతేకాకుండా, ANIvsWikipedia: ANI వికీపీడియా నుండి 2 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని కోరింది.
దీంతో హైకోర్టు వికీపీడియాకు సమన్లు జారీ చేసింది. ANI వికీపీడియా పేజీలో సవరణలు చేసిన ముగ్గురు వ్యక్తుల సమాచారాన్ని బహిర్గతం చేయాలని ఆదేశించింది. కానీ, ఆ ఆదేశాలను వికీపీడియా పట్టించుకోలేదు. దీంతో ఏఎన్‌ఐ ఈ ఆదేశాలను పాటించలేదని ఆరోపిస్తూ హైకోర్టులో ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేసింది.
దీనిపై విచారణ సందర్భంగా వికీపీడియా న్యాయవాది కోర్టుకు కోర్టు ఆదేశాలకు సంబంధించి కొన్ని సమర్పణలు చేయాల్సి ఉందని, వికీపీడియా భారతదేశంలో ఆధారితం కానందున వారు హాజరు కావడానికి సమయం పట్టిందని చెప్పారు.
ANI vs Wikipedia: అయితే, ఈ వాదనను కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా కోర్టు వికీపీడియా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. “మేము ధిక్కారాన్ని విధిస్తాం..ఇది భారతదేశంలో వికీపీడియా ఒక సంస్థ కాదనే ప్రశ్న కాదు. మేము మీ వ్యాపార లావాదేవీలను ఇక్కడ మూసివేస్తాము. మేము వికీపీడియాను బ్లాక్ చేయమని ప్రభుత్వానికి చెబుతాము. ముందుగా మీరు కూడా ఈ వాదనను స్వీకరించారు. మీకు భారతదేశం నచ్చకపోతే, దయచేసి భారతదేశంలో పని చేయకండి.” అంటూ కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది.
మొత్తంగా చూసుకుంటే, ANI కేసులో వికీపీడియాకు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు.