ANI vs Wikipedia: భారత్ నచ్చకపోతే ఇక్కడ పనిచేయకండి.. వికీపీడియాకు కోర్టు ధిక్కార నోటీసులు ప్రముఖ వార్తా సంస్థ ANI.. తన వికీపీడియా పేజీలో చేసిన మార్పులు తమకు పరువు నష్టం కలిగించాయని ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. ఆ మార్పులు చేసిన ముగ్గురు వ్యక్తుల సమాచారాన్నివ్వాలని కోర్టు కోరింది. ఆ సమాచారం ఇవ్వకపోవడంతో కోర్టు ఈరోజు వికీపీడియాకు ధిక్కార నోటీసులు ఇచ్చింది. By KVD Varma 05 Sep 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ANI vs Wikipedia: వికీపీడియాకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ అయ్యాయి. ANI వికీపీడియా పేజీలో సవరణలు చేసిన వ్యక్తుల సమాచారాన్ని బహిర్గతం చేయాలని గతంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలను పాటించనందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం వికీపీడియాకు కోర్టు ధిక్కార నోటీసును జారీ చేసింది. బార్ అండ్ బెంచ్ ఈ విషయాన్ని తన X పోస్ట్ ద్వారా వెల్లడించింది. ANI vs Wikipedia: ‘మీకు ఇండియా నచ్చకపోతే దయచేసి భారత్‌లో పని చేయకండి.. భారత్‌లో వికీపీడియాను బ్లాక్ చేయమని ప్రభుత్వాన్ని కోరతాం’ అని ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ పోస్ట్ లో బార్ అండ్ బెంచ్ తెలిపింది. వికీపీడియా అధికారిక ప్రతినిధిని అక్టోబర్ 25న కోర్టులో వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఆరోజు జరుగుతుంది. "If you don't like India, please don't work in India... We will ask government to block Wikipedia in India." Delhi High Court issues contempt of court notice to Wikipedia for not complying with the Court's order directing it to disclose info about people who made edits on ANI's… pic.twitter.com/fB3SFjN3pO — Bar and Bench (@barandbench) September 5, 2024 ఏం జరిగింది? ANI vs Wikipedia: వార్తా సంస్థ ANI మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పరువు నష్టం కలిగించేలా తన కంటెంట్ లో మార్పు చేసినట్టు ఢిల్లీ హైకోర్టులో వికీపీడియాపై దావా వేసింది. ప్లాట్‌ఫారమ్‌లోని తమ వార్తా సంస్థ పేజీలో పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించకుండా వికీపీడియాను నిరోధించాలని ANI కోరింది. కంటెంట్‌ను తీసివేయాలని కూడా ఏజెన్సీ కోరింది. అంతేకాకుండా, ANIvsWikipedia: ANI వికీపీడియా నుండి 2 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని కోరింది. దీంతో హైకోర్టు వికీపీడియాకు సమన్లు జారీ చేసింది. ANI వికీపీడియా పేజీలో సవరణలు చేసిన ముగ్గురు వ్యక్తుల సమాచారాన్ని బహిర్గతం చేయాలని ఆదేశించింది. కానీ, ఆ ఆదేశాలను వికీపీడియా పట్టించుకోలేదు. దీంతో ఏఎన్‌ఐ ఈ ఆదేశాలను పాటించలేదని ఆరోపిస్తూ హైకోర్టులో ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనిపై విచారణ సందర్భంగా వికీపీడియా న్యాయవాది కోర్టుకు కోర్టు ఆదేశాలకు సంబంధించి కొన్ని సమర్పణలు చేయాల్సి ఉందని, వికీపీడియా భారతదేశంలో ఆధారితం కానందున వారు హాజరు కావడానికి సమయం పట్టిందని చెప్పారు. ANI vs Wikipedia: అయితే, ఈ వాదనను కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా కోర్టు వికీపీడియా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. “మేము ధిక్కారాన్ని విధిస్తాం..ఇది భారతదేశంలో వికీపీడియా ఒక సంస్థ కాదనే ప్రశ్న కాదు. మేము మీ వ్యాపార లావాదేవీలను ఇక్కడ మూసివేస్తాము. మేము వికీపీడియాను బ్లాక్ చేయమని ప్రభుత్వానికి చెబుతాము. ముందుగా మీరు కూడా ఈ వాదనను స్వీకరించారు. మీకు భారతదేశం నచ్చకపోతే, దయచేసి భారతదేశంలో పని చేయకండి.” అంటూ కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. మొత్తంగా చూసుకుంటే, ANI కేసులో వికీపీడియాకు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. #ani-vs-wikipedia #wikipedia మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి