Delhi Baby Care Hopital Accident: మంటల్లో ఢిల్లీ బేబీ కేర్ ఆసుపత్రి.. సాహసంతో శిశువుల ప్రాణాలు కాపాడిన స్థానికులు ఢిల్లీ బేబీ కేర్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు శిశువులు మరణించారు. అయితే, ప్రమాద సమయంలో స్థానికులు తమ ప్రాణాలకు తెగించి శిశువులను కాపాడారు. సంఘటన గురించి వారు వివరించిన విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 27 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Delhi Baby Care Hopital Accident: ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలోని బేబీ కేర్ సెంటర్‌లో ఎనిమిది ఆక్సిజన్ సిలిండర్లు పేలడంతో మంటలు చెలరేగడంతో ఆరుగురు నవజాత శిశువులు మరణించారు. ఈ సంఘటన మే 25 అర్ధ రాత్రి జరిగింది. మే 26న, కొన్ని కుటుంబాలు ఈ సంఘటన ఒక రోజు తర్వాత తమకు తెలిసిందని ఆరోపించారు. మా పిల్లల ఆచూకీ గురించి మాకు సమాచారం ఇవ్వడం లేదని వారు చెప్పారు. ఈ ప్రమాదంలో ఒక రోజు నుండి 25 రోజుల వయస్సు గల పిల్లలు మరణించారు. ఢిల్లీ పోలీసులు చైల్డ్ హాస్పిటల్ యజమాని నవీన్ ఖిచిపై IPC సెక్షన్లు 336 (ఇతరుల వ్యక్తిగత భద్రతకు ప్రమాదం), 304A (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం) మరియు 34 (నేరపూరిత చర్య) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతను పశ్చిమ విహార్ నివాసి. అతడిని ఈరోజు (మే 27) అరెస్టు చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు. ఆసుపత్రిలో అక్రమంగా ఆక్సిజన్ రీఫిల్లింగ్.. Delhi Baby Care Hopital Accident: ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ప్రాథమిక విచారణలో ఆక్సిజన్ సిలిండర్ పేలడమే కారణమని చెబుతున్నారు. బేబీ కేర్ సెంటర్ కింది అంతస్తులో అక్రమంగా ఆక్సిజన్ సిలిండర్ రీఫిల్లింగ్ పనులు జరుగుతున్నాయి. రాత్రి 11:30 గంటలకు అగ్నిప్రమాదంపై సమాచారం అందిందని అగ్నిమాపక అధికారి తెలిపారు. “మొత్తం 16 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అప్పటికి మంటలు పై అంతస్తులకు, సమీపంలోని రెండు భవనాలకు వ్యాపించాయి. బేబీ కేర్ సెంటర్‌కి వెళ్లేందుకు బయటి నుంచి ఒకే స్పైరల్ ఇనుప మెట్లున్నాయి. అది కూడా అగ్నికి ఆహుతైంది.” అని ఆయన చెప్పారు. ప్రాణాలకు తెగించి.. Delhi Baby Care Hopital Accident: ప్రమాదం జరిగిన సమయంలో అక్కడి దగ్గరలో నివసిస్తున్న పద్మశ్రీ జితేంద్ర సింగ్ శాంతి వేగంగా స్పందించారు. ఏమి చేయాలో పాలుపోకపోయినా.. తోటి వారి సహకారం తీసుకుని పిల్లలను రక్షించడానికి ముందుకు వెళ్లారు. ఆయన ప్రమాద స్థలానికి వెళ్ళేటప్పటికి ఆసుపత్రి.. పక్కనే ఉన్న రెండు భవనాలు మంటల్లో చిక్కుకుని ఉన్నాయి. ఆసుపత్రి సిబ్బంది.. నలుగురు నర్సులు, ఇద్దరు గార్డులు, ఒక వార్డ్ బాయ్ అప్పటికే పారిపోయారు. ఈ పరిస్థితుల్లో జితేంద్ర సింగ్ తన డ్రైవర్ రాజేంద్ర, సహోద్యోగి ఆనంద్ లతో కలిసి ధైర్యం చేశారు. వారు ముఖానికి తడి తువ్వాలు కట్టుకుని, సెంటర్ వెనుక వైపు నుండి మెట్లను ఉపయోగించి లోపలికి వెళ్లారు. అక్కడ మంటల మధ్య ఓ గదిలో 8 మంది, మరో గదిలో 4 మంది చిన్నారులు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వారిలో ఇద్దరికి ఆక్సిజన్ అందించారు. మానవహారంగా ఏర్పడి కిటికీలోంచి పిల్లలను ఒక్కొక్కరిగా బయటకు తీసి ఆస్పత్రికి పంపించారు. Also Read: గుజరాత్ నుంచి ఢిల్లీ వరకూ 24 గంటల్లో మూడు అగ్నిప్రమాదాలు.. బూడిదైన 42 ప్రాణాలు.. ఆ సమయంలో అక్కడికి చాలామంది జనం వచ్చి చేరారు. కానీ, అందరూ మొబైల్ ఫోన్స్ లో కాలిపోతున్న ఆసుపత్రిని వీడియోలు, ఫోటోలు తీయడంలో బిజీగా ఉన్నారు. ఎవరూ అక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అగ్నిమాపక సిబ్బంది ఆసుపత్రికి చేరుకోవడానికి కూడా ఈ ప్రజలను తప్పించడానికి శ్రమించాల్సి వచ్చింది. ఆలాంటి పరిస్థితుల్లో జితేంద్ర సింగ్ అతని స్నేహితులు చేసిన సాహసాన్ని అగ్నిమాపక అధికారులు ప్రశంసిస్తున్నారు. Delhi Baby Care Hopital Accident: తన అనుభవాన్ని వివరిస్తూ, స్థానిక నివాసి జితేందర్ సింగ్ పిటిఐతో మాట్లాడుతూ, "నాకు రాత్రి 11:25 గంటలకు అగ్నిప్రమాదం గురించి కాల్ వచ్చింది. 11:30 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్నాను. నేను వచ్చిన తర్వాత మూడు పేలుళ్లు సంభవించాయి. మొదటిది మొత్తం భవనాన్నీ మంటల్లో ముంచేసింది. రెండవది ఆక్సిజన్ సిలిండర్ పేలడానికి కారణమైంది." అని అయన చెప్పారు. "ఆసుపత్రి భవనం ముందు భాగం కాలిపోతోంది. కాబట్టి మేము వెనుక ఉన్న కిటికీలు తెరిచి పిల్లలను రక్షించడానికి లోపలికి వెళ్ళాము" అని వివరించారు. ఆ తరువాత పొగ - అలసట కారణంగా తానూ కూడా స్పృహ కోల్పోయానని తరువాత ఆసుపత్రికి వెళ్లవలసి వచ్చిందని సింగ్ చెప్పాడు. ఆయన ఇంకా "ఏడుగురు పిల్లలు మరణించారు. ఒక మరణం సహజమైనది. రాత్రి 8 గంటలకు సంభవించింది, ఆరుగురు అగ్నిప్రమాదం కారణంగా మరణించారు. ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. నలుగురికి స్వల్ప కాలిన గాయాలు ఉన్నాయి" అని ఆయన చెప్పారు. #delhi-accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి