దీపావళి రోజు ఆ దిక్కున దీపం పెడితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే!

దీపావళి రోజున దక్షిణ దిశలో దీపం వెలిగించడం అంత మంచిది కాదు. ఈ దిక్కును యమధర్మ రాజు దిక్కుగా వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ దిక్కున దీపం వెలిగిస్తే జీవితంలో లేనిపోని కష్టాలు వచ్చి చేరాతాయని పండితులు వివరిస్తున్నారు.

దీపావళి రోజు ఆ దిక్కున దీపం పెడితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే!
New Update

హిందూ పండుగలలో అన్ని పండుగలు ఒక ఎత్తు అయితే..దీపావళి పండుగ ఒక ఎత్తు. పిల్లలు పెద్దలు అందరూ కూడా దీని కోసం చాలా ఎదురు చూస్తారు. ఈ పర్వదినాన్ని కొందరు మూడు రోజులు జరుపుకుంటే మరికొందరు 5 రోజులు జరుపుకుంటారు. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా నిర్వహించుకుంటారు.

దీపావళి అంటేనే దీపాలను వెలిగించి జరుపుకునే ప్రత్యేకమైన పండుగ. అమావాస్య పూట చీకట్లను తరిమికొట్టి..ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపే పండుగగా దీనిని జరుపుకుంటారు. అయితే ఈ దీపావళి రోజున దీపాలు వెలిగించడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది దిశ.

దీపావళి రోజున దక్షిణ దిశలో దీపం వెలిగించడం అంత మంచిది కాదు. ఈ దిక్కును యమధర్మ రాజు దిక్కుగా వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ దిక్కున దీపం వెలిగిస్తే జీవితంలో లేనిపోని కష్టాలు వచ్చి చేరాతాయని పండితులు వివరిస్తున్నారు. దీపం వెలిగించడానికి ఉత్తమమైనది ఈశాన్యం.

దేవుని గదిలో లక్ష్మీ దేవి ముందు దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. అమ్మవారి ముందు దీపాన్ని ఉంచడం వల్ల సంపద పెరుగుతుందని భావిస్తారు. అలాగే తులసి మొక్క ముందు దీపం పెట్టడం కూడా శుభప్రదమని అంటుంటారు. ఇది ఆనందాన్ని , లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది.

అలాగే ఇంట్లో దీపం పెట్టాలనే నమ్మకం ఉంది. వంటగదిలో ఆగ్నేయ మూలలో ఎల్లప్పుడూ దీపం ఉంచాలని నమ్ముతారు. ఇలా చేస్తే లక్ష్మీ, అన్నపూర్ణేశ్వరి అనుగ్రహం మీకు లభిస్తుందని నమ్మకం. వీలైనంత వరకు మట్టి దీపం వెలిగించాలని పండితులు చెపుతున్నారు.

Also read: దీపావళి నాడు లక్ష్మీ పూజలో ఈ చిట్కాలు పాటిస్తే చాలు..మీకు డబ్బే..డబ్బు!

#tips #diyas #deepavali #vsthu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe