Deep Fake Eraser: ఎవరో మీరు అసభ్యకరంగా ఉన్నట్టు కనిపిస్తున్న ఫోటోను వైరల్ చేసారు. దీంతో మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. ఇప్పటీకే సినిమా హీరోయిన్లు రష్మిక, ప్రియాంక చోప్రాతో సహా చాలామంది ఈ డీప్ ఫేక్ బారిన పడ్డారు. మరి అటువంటప్పుడు ఏమి చేయాలి? ఇంటర్నెట్‌లో ఏదైనా వైరల్ అయితే, అది ప్రపంచామంతా తిరిగేస్తుంది. ఎవరైనా మిమ్మల్ని డీప్‌ఫేక్‌గా ఫోటో తీసి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తే, ఆందోళన చెందడం సహజం. అయితే, మీరు దానిని వదిలించుకోవచ్చు. దీని కోసం మీరు ఇంటర్నెట్ నుంచి మీ ఫోటోను తీసివేసే వెబ్‌సైట్ ను ఉపయోగించుకోవచ్చు.
Deep Fake Eraser: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ పరిస్థితిలో ఎవరిదైనా అసభ్యకరమైన ఫోటోను సృష్టించవచ్చు. ప్రతి రోజు ఇలాంటి ఉదంతాలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. వ్యక్తుల డీప్‌ఫేక్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇలాంటి కేసులు ఎక్కువగా మహిళలపైనే జరుగుతుంటాయి. AIతో చేసిన ఫోటోలు పూర్తిగా వాస్తవమైనవిగా కనిపిస్తాయి. అందుకే పరువు నష్టం భయం కలుగుతోంది. ఇంటర్నెట్‌లో ఏదైనా వైరల్ అయిన తర్వాత, దాన్ని తొలగించడం చాలా కష్టం. అయితే, ఎవరైనా మీ సెల్ఫీని ఇంటర్నెట్‌లో వైరల్ చేసినట్లయితే, దాన్ని తీసివేయడానికి ఒక మార్గం ఉంది.
మీ సరైన ఫోటో AI ద్వారా అభ్యంతరకరమైన ఫోటోగా మారుస్తారు. సైబర్ నేరగాళ్లు ఇలాంటి అసభ్య ఫొటోలు తయారు చేసి బ్లాక్‌మెయిలింగ్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అటువంటి సందర్భంలో, మీరు వెబ్‌సైట్ సహాయం తీసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్ ఇంటర్నెట్ నుంచి నగ్న ఫోటోలను తొలగిస్తుందని చెబుతున్నారు. అయితే ఇది ఎలా సాధ్యం? ఈ వెబ్‌సైట్‌ను ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం.
ఈ పోర్టల్ సహాయం చేస్తుంది
Deep Fake Eraser: ఎవరైనా మీ అసభ్యకర ఫొటోతో బెదిరిస్తే, వెంటనే StopNCII.org వెబ్‌సైట్‌కి వెళ్లండి. మీ అనుమతి లేకుండా షేర్ చేసిన లేదా అప్‌లోడ్ చేసిన అభ్యంతరకరమైన ఫోటోలను ఇంటర్నెట్ నుంచి తొలగిస్తున్నట్లు ఈ వెబ్‌సైట్ చెబుతోంది. ఇది ఇంటర్నెట్‌లో నగ్న ఫోటోలు లేదా వీడియోలు వైరల్ అయిన వ్యక్తులకు సహాయపడే ఉచిత సాధనం.
Also Read: రోజూ మేకప్ వేసుకుంటున్నారా జాగ్రత్త..ఈ సమస్యలు తప్పవు
మీ ఫోటో లేదా వీడియో మార్ఫింగ్ జరిగితే, ఈ వెబ్‌సైట్ దాని హాష్‌ని సృష్టిస్తుంది. ఇమేజ్ హ్యాషింగ్ ఒక అల్గారిథమ్ ఉపయోగించి చేస్తారు. ఇది చిత్రానికి ప్రత్యేకమైన హాష్ విలువను ఇస్తుంది. దీనిని కొన్నిసార్లు 'డిజిటల్ వేలిముద్ర' అని కూడా పిలుస్తారు. StopNCII ఈ హాష్ విలువను భాగస్వామి కంపెనీలతో పంచుకుంటుంది. ఇది ఫోటోలను తెలుసుకోవడంలో, తొలగించడంలో సహాయపడుతుంది.
ఇలా చేయండి..
మీ ఎడిట్ చేసిన లేదా నగ్న ఫోటోలను ఇంటర్నెట్ నుంచి తీసివేయడానికి, మీరు StopNCII పోర్టల్‌లో కేసు నమోదు చేయాలి . ఇక్కడ మీరు తొలగించాలనుకుంటున్న ఫోటోలు.. వీడియోలను అప్‌లోడ్ చేయాలి. ఇది కాకుండా, మీరు నగ్న కంటెంట్‌ని సృష్టించడానికి ట్యాంపర్ చేసిన ఒరిజినల్ ఫోటో-వీడియోను కూడా అందించాలి. మీరు ఈ పోర్టల్‌లో మీ కేసు స్థితిని కూడా చెక్ చేసుకోవచ్చు.
StopNCII పోర్టల్ అంటే ఏమిటి?
StopNCII పోర్టల్ రివెంజ్ పోర్న్ హెల్ప్‌లైన్ (RPH) నిర్వహిస్తోంది. ఇది అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. RPH అనేక వేల మంది బాధితులకు సహాయం చేసింది. దాని తొలగింపు రేటు 90 శాతంగా ఉందని పేర్కొంది. RPH ఇంటర్నెట్ నుంచి 2 లక్షలకు పైగా అభ్యంతరకర చిత్రాలను తొలగించింది.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల సమాచారం అలాగే ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే ఇచ్చినది. StopNCII వెబ్‌సైట్‌ను ఉపయోగించడం లేదా ఫోటోలు లేదా వీడియోలను అప్‌లోడ్ చేయడం మొదలైనవి అన్ని విషయాలను చెక్ చేసుకుని, మీ స్వంత బాధ్యతతో చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం.
Watch this interesting Video: