Telangana News: తెలంగాణలో సంచలన తీర్పు.. ఆ దుర్మార్గుడికి ఉరి శిక్ష..!!

మూడేళ్ల క్రితం తెలంగాణలో సంచలనం రేపిన బాలుడి హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష పడింది. అభం శుభం తెలియని బాలుడికి మాయ మాటలు చెప్పి...కిడ్నాప్ చేసి...నిర్మానుష్య ప్రదేశంలో గొంతునులిమి హత్య చేసి...శవాన్ని పెట్రోలు పోసి తగలబెట్టాడు నిందితుడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బాలుడిని ప్రాణాలు తీసిన నిందితుడు మంద సాగర్ ను దోషిగా నిర్దారించిన కోర్టు...అతడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది.

New Update

ఈ కేసు పూర్తి వివరాలను మహబూబాబాద్ ఎస్పీ చంద్రమోహన్ వెల్లడించారు. మహబూబాబాద్ లోని క్రుష్ణాకాలనీలో నివసించే వీడియో జర్నలిస్టు కుసుమ రంజిత్ రెడ్డి, వసంతల కుమారుడు దీక్షిత్ రెడ్డి. వీరికి ఇద్దరు కుమారులు. అందులో దీక్షిత్ రెడ్డి చిన్నవాడు. మందసాగర్ ది శివారు శనిగపురం గ్రామం. సాగర్ బైక్ ఆటో మొబైల్ మెకానిక్. జల్సాలకు అలవాటు పడ్డ సాగర్ సులభంగా డబ్బు సంపాదించేందుకు ప్లాన్ వేశాడు. పిల్లలను కిడ్నా్ చేస్తూ డబ్బులు వసూలు చేయాలని పథకం పన్నాడు. 2020 అక్టోబర్ 18వ తేదీ సాయంత్రం దీక్షిత్ రెడ్డి రోడ్డు పై ఆడుకుంటున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సాగర్ ...దీక్షిత్ కు మాయ మాటలు చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లాడు. కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ దీక్షిత్ గొంతు నులిమి చంపేశాడు. శవంపై పెట్రోలు పోసి తగలబెట్టాడు. తర్వాత బాలుడి తల్లికి ఫోన్ చేసి వారి కుమారుడిని కిడ్నాప్ చేశానని...మీ కుమారుడు మీకు కావాలంటే రూ. 45లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: కేవలం రూ.5 లక్షలకే అదిరిపోయే కార్.. ఓ లుక్కేయండి..!!

కాగా అదేరోజు రాత్రి బాలుడి తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి సీఐ ఎస్ రవికుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఘటన జరిగిన మూడు రోజులకు అక్టోబర్ 21న దానమయ్య గుట్టపై దీక్షిత్ శవాన్ని గుర్తించారు. తర్వాత రోజు అంటే అక్టోబర్ 22న సాగర్ ను అరెస్టు చేశారు. ఖమ్మం జైలుకు తరలించారు. 2021, జూన్ 28న 650పేజీలతో మహబూబాబాద్ జిల్లా కోర్టుకు డాక్యుమెంట్లు సమర్పించారు పోలీసులు. అరెస్టు అయిన సాగర్ బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే కోర్టు వాయిదాల్లో అతడు కోర్టుకు హాజరుకాకపోవడంతో జిల్లా ప్రధానన్యాయమూర్తి 20అక్టోబర్ 2022న నాన్ బెయిల్ వారెంట్ జారీ చేశారు. అప్పటి నుంచి సాగర్ ఖమ్మం జైల్లోనే ఉన్నాడు.

ఇది కూడా చదవండి: నడుము నొప్పి పోవాలంటే.. వెంటనే వీటిని తినండి!

ఈ కేసులో మొత్తం 48మంది సాక్షులకు గాను 43 మందిని కోర్టు ముందు ప్రవేశపెట్టారు. పూర్వపరాలు విన్న కోర్టు మందసాగర్ ను దోషిగా నిర్ధారించి ఉరిశిక్షతోపాటు రూ. 33వేల జరిమాన విధిస్తూ తీర్పును వెల్లడించింది. మందసాగర్ ను హైదరాబాద్ చర్లపల్లి జైలుకు తరలించారు. దాదాపు మూడేళ్ల తర్వాత నిందితుడికి ఉరిశిక్ష పడినందుకు బాలుడి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు న్యాయం జరిగిందన్నారు.

Advertisment
తాజా కథనాలు