ప్రకృతి చాలా విశాలమైంది, వైవిధ్యమైంది. తెలుసుకున్న కొద్దీ మనిషి మేధస్సుకు కొత్త ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది, కొత్త ఫజిల్ ని ఇస్తూనే ఉంటుంది. ప్రకృతిలో దాగి వింతలు,విశేషాలు, రహస్యాలు ఇలా వేటికవే ప్రత్యేకమైనవి. అలాంటి ఓ స్పెషల్ సముద్రం గురించి మీకు పరిచయం చెయ్యాల్సిందే.!
ఆ సముద్రం ప్రత్యేకత ఏంటంటే ఆ సముద్రంలోకి వెళ్లిన వాళ్లు మునిపోరు..బెండులా అలలపై తేలిపోతారు. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం.!ఆ సముద్రంలో తేలుతూ లాహిరి లాహిరి లాహిరిలో అంటూ తేలిపోవాలని ఉంది కదూ. దీని పేరు “డెడ్ సీ”.
కంగారు పడకండి..!మనకు ఎలాంటి భయం అక్కర్లేదు. అది ఒకప్పుడు బాగా బతికిన సముద్రం. ఓడలు బళ్లు ..బళ్లు ఓడలు అవుతాయంటారు కదా ఆ బాపతన్న మాట..! వేల సంవత్సరాలుగా భూమిలో జరిగిన మార్పుల ఫలితంగా ఓ సముద్రానికి ఉండే లక్షణాలు కాలగర్భంలో కలిసిపోయి, ప్రత్యేకమైన అవలక్షణాలు వచ్చాయన్న మాట.!
ఈ సముద్రం జోర్డాన్, ఇజ్రాయెల్ మధ్య ఉంది. ఈ సముద్రం ప్రపంచంలోనే అత్యంత లోతైన ఉప్పునీటి సరస్సుగా ప్రసిద్ధి చెందింది. ఈ సముద్రపు నీటి పీడనం పైకి ఉన్నందున ఇక్కడ ఎవరూ మునిగిపోరు.
కాబట్టి, మీరు ఈ సముద్రంలో హాయిగా ఈత కొట్టవచ్చు. నిద్రపోవచ్చు, ఇక్కడ నీటిలో తేలుతూ పుస్తకాలు చదువుకోవచ్చు,అవసరమైతే పుస్తకాలు రాయొచ్చు. ఈ వింత, అద్భుతమైన సముద్రాన్ని చూసేందుకు లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు.
ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఎలాంటి భయం లేకుండా తమ ఇష్టానుసారంగా నీళ్లతో ఆడుకోవచ్చు.అయితే దీనికి డెడ్ సీ అని ఎందుకు పేరొచ్చిందో తెలుసుకుందాం. మొదట చెప్పినట్టుగా భూమిలో జరిగిన మార్పుల కారణంగా దాదాపు 1388 అడుగుల దిగువకు ఈ సముద్రం వెళ్లిపోయింది.ఈ డెడ్ సీ సుమారు మూడు లక్షల సంవత్సరాల నాటిదని చెబుతారు.
ఈ సముద్రంలో నీటి సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది.ఈ సముద్రపు నీటి ప్రవాహం విచిత్రంగా దిగువ నుండి పైకి ఉంటుంది. కాబట్టి నీటిపై పడుకున్నా మునగే ఛాన్స్ ఉండదు.ఈ సముద్రపు నీటిలో లవణీయత ఎక్కువ.ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల ఈ సముద్రంలో ఏ జీవమూ మనుగడ సాగించదు. ఇక్కడ సముద్ర జీవులు మాత్రమే కాదు, గడ్డి, మొక్కల నోడ్యూల్స్ పెరగవు.
మృత సముద్రపు నీటిలో పొటాష్, బ్రోమైడ్, జింక్, సల్ఫర్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే దీనినుంచి వచ్చిన ఉప్పును కూడా ఉపయోగించలేరు.
సముద్రాన్ని సందర్శించే పర్యాటకులు ఈ సముద్రంలో ఎటువంటి జీవరాశులు నివసించలేవు, కాబట్టి నీటిలోని విష జంతువులు కాటువేస్తాయనే భయం కూడా లేదు. దీనివల్ల పర్యాటకులు నిర్భయంగా ఇక్కడ గడిపేస్తున్నారు.
లవణీయత ఎక్కువగా ఉన్నందున మృత సముద్రపు నీరు మరింత ప్రసిద్ధి చెందిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది అన్ని ఇతర సముద్రపు నీటిలో కంటే 33 శాతం ఎక్కువ ఉప్పును కలిగి ఉంది. ఈ కారణంగా అనేక వ్యాధులకు ఈ సముద్ర నీరు దివ్యౌషధం.
ఈ నీటిలో స్నానం చేయడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయని తేలింది. దీని నీటిని అనేక ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు.ఈ సముద్రపు మట్టిని అనేక సౌందర్య ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.