/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/swarajya_2023-07_34549675-c113-4a39-88ec-ba2b65c19adf_Screenshot_2023_07_27_at_8_28_01_AM.webp)
యూఎస్ మాజీ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ డేవిడ్ గ్రుష్ ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపాడు. అమెరికా గ్రహాంతర విమానాలను కలిగి ఉందని వెల్లడించారు. గ్రహాంతర కళేబరాలు కూడా ఉండే ఉండొచ్చని హింటిచ్చాడు. ఈ విషయాన్ని యూఎస్ ప్రభుత్వం దాస్తోందని పేర్కొన్నాడు.
ది గార్డియన్ వివరాల ప్రకారం, దేశంలోని ఆయా ప్రభుత్వాలు దశాబ్ధాలుగా సంబంధిత వ్యవహరాలు నడిపాయని గ్రుష్ పేర్కొన్నాడు, ఆ ప్రయత్నంలో ఎగిరే వస్తువులను గుర్తించబడ్డాయని, వీటికోసం రివర్స్-ఇంజనీర్ చేయడానికి ప్రయత్నించిందని వాదించారు.
ఇది వరకు తాను డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌లో వివరించలేని క్రమరహిత దృగ్విషయాల విశ్లేషణ (analysis of unexplained anomalous phenomena)కు నాయకత్వం వహించానని తెలిపారు.
ప్రభుత్వ రహస్యంగా నిర్వహించే UFO(undefined flying objects) ప్రోగ్రామ్‌లకు తాను నిరాకరించబడ్డానన్నారు. అయితే ప్రభుత్వం UFO ప్రయత్నాల సమయంలో గాయపడిన వ్యక్తుల గురించి కూడా తనకు తెలుసునని డేవిడ్ గ్రుష్ వివరించాడు.
US కాంగ్రెస్ మహిళ నాన్సీ మేస్..ఏలియన్ క్రాఫ్ట్ ల పైలట్ల మృతదేహాలను నిజంగా వెలికితీశారా అని గ్రుష్‌ని అడిగినప్పుడు “నేను ఇంతకు ముందు బహిర్గతం చేసినట్టుగా ఈ రికవరీలలో కొన్ని బయోలాజిక్స్ వచ్చాయని” గ్రుష్ చెప్పుకొచ్చాడు.
ఇంతకు అవి మానవులకు సంబంధించినవేమో అని అడిగిన ప్రశ్నకు అవి మానవులకు సంబంధించిన జీవ పదార్థాలు కాదని..ఈ విషయాన్ని జీవశాస్త్ర నిపుణులు చెప్పినవేనని మరింత కాన్ఫిడెంట్ గా సమాధానమిచ్చాడు గ్రుష్.
గ్రుష్ ఆరోపణలు జూన్‌లో తుఫానుకు దారితీశాయి, దీని నిమిత్తం అతను కొన్ని ప్రభుత్వ సంబంధిత శక్తుల నుంచి తీవ్రప్రతీకారాన్ని ఎదుర్కొన్నాడు. అయితే రిపబ్లికన్‌ల నియంత్రణలో పర్యవేక్షణ కమిటీ విచారణను ప్రారంభించింది.అయితే పెంటగాన్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్) ఒక ప్రకటనలో గ్రుష్ వాదనలను ఖండించింది.
‘ఏలియన్ బాడీస్ స్వాధీనం లేదా రివర్స్-ఇంజనీరింగ్‌కు సంబంధించిన ఎటువంటి ప్రోగ్రామ్‌లు గతంలోగానీ ప్రస్తుతం గానీ లేవని క్లారిటీ ఇచ్చింది. గ్రుష్ వాదనలను రుజువు చేయడానికి ధృవీకరించబడిన ఎటువంటి పరిశోధనలు లేవని ప్రతినిధి స్యూ గోఫ్ పేర్కొన్నారు.
పెంటగాన్ గ్రుష్ వాదనలు కొట్టి పడేస్తున్నప్పటికీ ఇదివరకు ముందు, పెంటగాన్ ఆకాశంలో వివరించలేని విమానాలను (undefined flying objects) చూపుతున్న సైనిక వీడియోలను విడుదల చేసింది. 2021 నివేదికలో, UAP ఎన్‌కౌంటర్ల యొక్క 140 గుర్తించబడిన సందర్భాలను వివరించలేమంటూ పెంటగాన్ జాగర్తపడింది.