వివేకా హత్య కేసులో కీలక పరిణామం.!

వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసులో తనను నిందితుడిగా తొలగించాలని దస్తగిరి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేవలం సాక్షిగా మాత్రమే పరిగణించాలని కోరాడు. కాగా, దస్తగిరి పిటిషన్ ను నాంపల్లి సీబీఐ కోర్టు రేపు విచారించనుంది.

వివేకా హత్య కేసులో కీలక పరిణామం.!
New Update

Dasthgiri: తెలుగు రాష్ట్రాలో సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసులో తనను నిందితుడిగా తొలగించాలని అప్రూవర్ గా మారిన మాజీ డ్రైవర్ దస్తగిరి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కేవలం సాక్షిగా మాత్రమే పరిగణించాలని తన పిటిషన్ లో విజ్ఞప్తి చేశాడు. గతంలో సీబీఐ చార్జిషీట్ లో తనను సాక్షిగా చేర్చిందని వివరించాడు. దస్తగిరి పిటిషన్ ను నాంపల్లి సీబీఐ కోర్టు రేపు విచారించనుంది.

Also Read: మోదీ నన్ను బెదిరించారు.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగింది. అయితే, ఇన్ని సంవత్సరాలు అయినప్పట్టికి ఇప్పట్టికి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏ మాత్రం కొలిక్కి రావడం లేదు. ఈ కేసులో నిందితుల్ని తేల్చేందుకు ప్రస్తుతం సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో వైఎస్ఆర్ సీపీకి చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు పలువురు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  ఈ నేపథ్యంలో ఈ హత్య ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? ఎవరు హత్య చేశారు? అనేది తేలలేదు.

మాజీ మంత్రి వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన A4 దస్తగిరి మినహా అందరినీ పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచారు. భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి తదితరులను కోర్టు ముందు హాజరు పరచడం జరిగింది. తాజాగా,  ఈ కేసులో అప్రూవర్ గా మారిన మాజీ డ్రైవర్ దస్తగిరి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వివేకా హత్య కేసులో తనను నిందితుడిగా తొలగించాలని తన పిటిషన్ లో విజ్ఞప్తి చేశాడు.

#viveka-murder-case
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe