Dogs Ban: ఈ బ్రీడ్స్‌ పెంపుడు కుక్కలపై నిషేధం.. లిస్ట్ ఇదే!

ఇటీవలి కాలంలో పెరుగుతున్న కుక్కల దాడి కేసులను దృష్టిలో ఉంచుకుని, భారతదేశంలో ప్రమాదకరమైనవిగా భావించే కొన్ని బ్రీడ్స్ అమ్మకం, పెంపకాన్ని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఆ బ్రీడ్స్ ఏంటో ఆర్టికల్‌లోకి వెళ్లి చూద్దాం!

New Update
Dogs Ban: ఈ బ్రీడ్స్‌ పెంపుడు కుక్కలపై నిషేధం.. లిస్ట్ ఇదే!

ఇటీవలి కాలంలో పెరుగుతున్న కుక్కల దాడి కేసులను దృష్టిలో ఉంచుకుని, భారతదేశంలో ప్రమాదకరమైనవిగా భావించే కొన్ని బ్రీడ్స్ దిగుమతి అలాగే వాటి అమ్మకం, పెంపకాన్ని నిషేధించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ నిషేధిత కుక్క జాతులలో పిట్‌బుల్, రోట్‌వీలర్, టెర్రియర్, మాస్టిఫ్స్, ఇతర వాటితోపాటు వాటి క్రాస్ బ్రీడ్‌లు కూడా ఉన్నాయి. ఈ కుక్క జాతులు ప్రమాదకరమైనవి మాత్రమే కాదు, వాటి దాడులు మానవుల మరణానికి కూడా కారణం కావచ్చు.

ET యొక్క నివేదిక ప్రకారం.. పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖలు ఈ జాతులకు సంబందించిన కుక్కలకు లైసెన్స్ జారీ చేయడం, అలాగే వాటి పెంపకాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటికే నిషేదించబడిన ఈ బ్రీడ్స్ ఉన్నవారు బ్రీడింగ్ నిరోధించడానికి వాటిని క్రిమిరహితం(sterilize) చేయాలని ప్రభుత్వం ఆదేశాలను ఇచ్చింది.

భారతదేశంలో ప్రభుత్వం నిషేధించిన డాగ్ బ్రీడ్స్
1. పిట్బుల్ టెర్రియర్
2. తోసా ఇను
3. అమెరికన్ స్టాఫోర్డ్‌షైర్ టెర్రియర్
4. ఫిలా బ్రసిలీరో
5. డోగో అర్జెంటినో
6. అమెరికన్ బుల్డాగ్
7. బోయెస్బోయెల్
8. కనగల్
9. సెంట్రల్ ఆసియన్ షెపర్డ్ డాగ్
10. కాకేసియన్ షెపర్డ్ డాగ్
11. దక్షిణ రష్యన్ షెపర్డ్ డాగ్
12. టోర్ంజక్, సర్ప్లానినాక్
13. జపనీస్ తోసా మరియు అకిటా
14. మాస్టిఫ్స్
15. రోట్వీలర్
16. టెర్రియర్లు
17. రోడేసియన్ రిడ్జ్‌బ్యాక్
18. వోల్ఫ్ డాగ్స్
19. కానరియో
20. అక్బాష్
21. మాస్కో గార్డ్
22. కేన్ కోర్సో
23. బాండోగ్

Also Read: రాహుల్ గాంధీ, కొండా సురేఖపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్..!

Advertisment
తాజా కథనాలు