Purandeswari: రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన వారు నీతులు పలకడం హాస్యాస్పదం: పురంధేశ్వరి హిందు ధర్మం ఆచరించే కోట్లాది మందిని రాహుల్ గాంధీ అవమానించారన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. దేశంలో ఎమర్జెన్సీ విధించిన పార్టీ కాంగ్రెస్, సిక్కుల ఊచకోత కోసిన కాంగ్రెస్.. నీతులు వెల్లడించడం హాస్యాస్పదమని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 02 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ నేషనల్ New Update షేర్ చేయండి Daggubati Purandeswari: పార్లమెంట్ లో రాహుల్ గాంధీ హిందు మతాన్ని అవమనపరుస్తూ మాట్లాడారంటూ బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తూ రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: పుణెలో జికా వైరస్ కలకలం.. ఇద్దరు గర్భవతులకు పాజిటివ్! '1975 వ సంవత్సరంలో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన వారు, అదే విధంగా వేలాది మంది సిక్కులను ఊచకోత కోసిన వారు పార్లమెంట్ లో నీతులు పలకడం హాస్యాస్పదంగా వుంది. నిన్న పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ హిందువులు అందరూ అసత్యమాడుతూ హింసకు పాల్పడుతున్నారని అంటూ దేశంలోని హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి, హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్న కోట్లాది మంది హిందువులకు క్షమాపణ చెప్పాలి'. అంటూ ట్వీట్టర్ లో పేర్కొన్నారు. 1975 వ సంవత్సరంలో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన వారు, అదే విధంగా వేలాది మంది సిక్కులను ఊచకోత కోసిన వారు పార్లమెంట్ లో నీతులు పలకడం హాస్యాస్పదంగా వుంది. నిన్న పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ హిందువులు అందరూ అసత్యమాడుతూ హింసకు… pic.twitter.com/W6oUC3j7B0 — Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) July 2, 2024 #daggubati-purandeswari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి