Dadi Ratnakar: వారు మర్యాదగా రాజీనామా చేస్తే బాగుంటుంది.. దాడి రత్నాకర్‌ స్వీట్ వార్నింగ్..!

వైసీపీ ప్రభుత్వంలో నామినేటెడ్‌ పదవులకు నియమింపబడిన వ్యక్తులు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు దాడి రత్నాకర్‌. ప్రభుత్వం మారిపోయినపుడు తమ పదవులను వదులుకోవడం నైతిక బాధ్యతని అన్నారు. ఇప్పటివరకు కేవలం 40శాతం మంది మాత్రమే రాజీనామా చేశారన్నారు.

Dadi Ratnakar: వారు మర్యాదగా రాజీనామా చేస్తే బాగుంటుంది.. దాడి రత్నాకర్‌ స్వీట్ వార్నింగ్..!
New Update

వారికి సహకరించవద్దు..

రాష్ట్ర కమిషన్లు, కార్పొరేషన్లు, సామాజిక వర్గాల కార్పొరేషన్లు, జిల్లా సహకార బ్యాంకులు, జిల్లా కో`ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీలు, ప్రాధమిక సహకార బ్యాంకులు, మార్కెటింగ్‌ కమిటీలు, దేవాలయాల ట్రస్టు బోర్డులు సంస్థల నామినేటెడ్‌ సభ్యులు తమ పదవులను ఇంకా అంటిపెట్టుకుని ఉండటం వారికే అవమానకరమని అన్నారు. రాజీనామాలు చేయని అనైతిక సభ్యులను గుర్తించవద్దని, వారికి సహకరించవద్దని అధికారులను కోరారు.

Also Read: చెల్లెలు షర్మిలతో రాజీ చేయాలని జగన్ కోరాడు.. ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!

పార్టీ విధానం..

నామినేటెడ్‌ పదవులు పొందిన కొందరు పార్టీ మారి మా కూటమి పార్టీల్లోకి చేరినప్పుడు వారి పదవులకు రాజీనామాలు చేసివుండాలనేది తమ పార్టీల విధానమని అన్నారు. అటువంటివారు గత ప్రభుత్వం ఇచ్చిన పదవుల్లో కొనసాగకుండా రాజీనామాలు చేసి, నూతన ప్రభుత్వం నామినేటెడ్‌ పదవులను నింపుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కూటమి పార్టీల నాయకులు సమిష్టిగా నామినేటెడ్‌ పదవుల భర్తీకి ప్రతిపాదనలను తయారుచేసి ప్రభుత్వానికి సమర్పిస్తారని, ప్రభుత్వం ఆయా పదవులను అర్హులకు నామినేట్‌ చేస్తారని అన్నారు.

కేవలం 40శాతం..

రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 40శాతం మంది మాత్రమే రాజీనామా చేశారని, మిగతావారు కూడ తమ నామినేటెడ్‌ పదవులకు రాజీమానాలు సమర్పించాలని కోరారు. పాలకవర్గంగా భావించి పనులను గాని చేస్తే అధికారులు కూడ తప్పుచేసినట్టు అవుతుందని, అధికారులు కూడ పాత బోర్డులను, పాలకవర్గాలను కూడ ఎట్టి పరిస్థితుల్లోను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అధికారులకు దాడి రత్నాకర్‌ విజ్ఞప్తి చేశారు.

#dadi-ratnakar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe