Cyclone Updates: మిజోరం, అస్సాంపై రెమాల్ తుపాను ప్రతాపం చూపిస్తోంది. మిజోరం, అస్సాం పరిసర ప్రాంతాల్లో తుపాను అల్పపీడనంగా మారి బలహీన పడనుంది. దీంతో రెండు రాష్ట్రాల్లో ఏకధాటిగా భారీ వర్షాలు కురువనున్నాయి. మిజోరంలో క్వారీ కుప్పకూలింది. 12 మంది మృతి చెందగా.. పలువురు గల్లంతు అయ్యారు. ఇంకా సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
Also Read: తల్లి పాలను విక్రయిస్తే అంతే.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వార్నింగ్..!
ఇంఫాల్-జిరిబామ్ హైవే దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి. రెమాల్ తుపానుతో అస్సాంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో చెట్లు కూలిపోగా సిబ్బంది చెట్లను తొలగిస్తున్నారు. గౌహతిలోనూ వాన దంచికొడుతుంది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Also Read: మెగాస్టార్ కి మరో అరుదైన గౌరవం!
మరోవైపు రుతుపవనాల రాకతో కేరళలోనూ వర్షాలు కురుస్తున్నాయి. వాగమోన్ ఏరటుపేట కొండచరియలు రోడ్డులో విరిగిపడ్డాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. మీనాచిల్ నదిలోనూ నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. లోతట్టు ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు. పాల ఏరతుపేట కొట్టాయంలో ఇంటి పైకప్పు కూలిపోయింది. భారీ ఈదురుగాలులకు మరో ఇల్లు దెబ్బతింది. కేరళలో పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.