Midhili cyclon: బంగాళాఖాతంలో 24 గంటల్లో మిధిలి తుఫాన్‌!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం..రానున్న 24 గంటల్లో తుఫాన్‌ గా మారుతుందని ఐఎండీ అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్‌ వద్ద తీరం దాటే అవకాశాలున్నట్లు ఐఎండీ అధికారులు వివరించారు.

Midhili cyclon: బంగాళాఖాతంలో 24 గంటల్లో మిధిలి తుఫాన్‌!
New Update

బంగాళాఖాతంలో (Bay of Bengal)  ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరో 24 గంటల్లో తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దీనికి అధికారులు మిధిలి అని పేరు పెట్టారు. ఈ తుఫాన్‌ బంగ్లాదేశ్‌ వద్ద తీరం దాటే అవకాశాలున్నట్లు ఐఎండీ అధికారులు వివరించారు. ఈ అల్పపీడనం గంటకు 17 కిలో మీటర్ల వేగంతో కదులుతోందని పేర్కొన్నారు.

తుఫాను కి పెట్టిన మిధిలి పేరును మాల్దీవులు సూచించింది. ఈ తుఫాన్ శనివారం ఉదయానికి బంగ్లాదేశ్‌ లోని ఖేపుపరా, మోంగ్లా మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. గురువారం ఉదయానికి ఏపీలోని విశాఖ కి తూర్పు- ఆగ్నేయంగా 390 కిలోమీటర్లు, ఒడిశాలోని పారాదీప్ కి దక్షిణం ఆగ్నేయంగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ ప్రకటించింది.

24 గంటల్లో తుఫానుగా బలపడి బంగ్లాదేశ్‌ తీరాన్ని మోంగ్లా, ఖేపుపరా మధ్య 60 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో దాటే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున గంటకు 80 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తుఫాన్‌ వల్ల ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

శనివారం వరకు నాగాలాండ్‌ , మణిపూర్‌, మిజోరాం, త్రిపుర, దక్షిణ అస్సాం, తూర్పు మేఘాలయ ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. మత్స్యకారులు శనివారం వరకు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది.

ప్రస్తుతం ఉన్న నమూనాల ప్రకారం తుఫాన్ బంగ్లాదేశ్ తీరం వైపు కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది.

Also read: రాత్రంతా మేల్కొని మరీ మ్యాచ్‌ ని ఎంజాయ్‌ చేశా: సత్య నాదెళ్ల!

#midhili #bangladesh #cyclon
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe