ఫ్లై ఓవర్ పై బైక్ రేసర్ వీరంగం..జస్ట్ మిస్ లేదంటే..!! టర్నింగ్ లో ఓవర్ స్పీడ్ డేంజర్ అంటూ వీడియోతో హెచ్చరించారు సైబరాబాద్ పోలీసులు. సూరత్ పట్టణంలో ఫ్లై ఓవర్ పై ఓ బైక్ రేసర్ వేగంగా దూసుకుపోయాడు. టర్నింగ్ లోనూ ఏ మాత్రం స్పీడ్ తగ్గించలేదు. దీంతో పిట్ట గోడను ఢీకొట్టి కింద పడిపోయాడు. కానీ, అదృష్టవశాత్తూ క్షేమంగా బయటబడ్డాడు. ఇంకొంచెం బ్యాలన్స్ తప్పితే వంతెన మీద నుంచి కింద పడి మరణించే వాడు. By Jyoshna Sappogula 09 Oct 2023 in Latest News In Telugu హైదరాబాద్ New Update షేర్ చేయండి Hyderabad: టర్నింగ్ లో ఓవర్ స్పీడ్ డేంజర్ అంటూ వీడియోతో హెచ్చరించారు సైబరాబాద్ పోలీసులు. సూరత్ పట్టణంలో ఫ్లై ఓవర్ పై ఓ బైక్ రేసర్ వేగంగా దూసుకుపోయాడు. టర్నింగ్ లోనూ ఏ మాత్రం స్పీడ్ తగ్గించలేదు. దీంతో పిట్ట గోడను ఢీ కొట్టి కింద పడిపోయాడు. కానీ, అదృష్టవశాత్తూ క్షేమంగా బయటబడ్డాడు. ఇంకొంచెం బ్యాలన్స్ తప్పితే వంతెన మీద నుంచి కింద పడి మరణించే వాడు. Implications of Over speeding at curve#RoadSafety pic.twitter.com/z382zzqbVl — CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) October 9, 2023 ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ.. సేఫ్ గా గమ్యస్థానం చేరాలంటూ పోలీసులు పదే పదే ఆడియో సందేశాలతో ప్రచారం చేస్తుంటారు. అయినా కానీ, చాలా మంది ట్రాఫిక్ రూల్స్ ని బ్రేక్ చేస్తుంటారు. రోడ్లపై 80, 100 కిలోమీటర్లకు పైగా వేగంగా దూసుకుపోయే బైక్ లు, కార్లు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. చివరికి పై వంతెనలపైనా అదే వేగంగా బైకర్లు డ్రైవింగ్ చేస్తుంటారు. కొంచెం స్థలం కనిపించినా చేప పిల్లల మాదిరిగా దూసుకుపోయే ప్రయత్నం చేస్తుంటారు. సూరత్ పట్టణంలో ఫ్లై ఓవర్ పై ఓ బైక్ రేసర్.. మలుపులో వేగం తగ్గించకుండా కారును ఓవర్ టేక్ చేసి ముందుకు పోవడంతో అది కాస్తా అదుపుతప్పి సైడ్ వాల్ ను ఢీకొట్టింది. పిట్ట గోడపై వాహనదారుడు పడిపోయాడు. ఇంకొంచెం బ్యాలన్స్ తప్పితే వంతెన మీద నుంచి కింద పడి మరణించే వాడడు.. కానీ, అదృష్టవశాత్తూ క్షేమంగా బ్రతికి బయటబడ్డాడు. వెనుక కారుకున్న కెమెరాలో ఇదంతా రికార్డ్ అయింది. కనుక హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నియమాలను పక్కాగా పాటిస్తూ సేఫ్ గా వాహనాలను నడుపాలని హెచ్చరిస్తున్నారు. Also Read: తెలంగాణలో స్కూల్‌బస్సు బోల్తా.. ఎంత మంది విద్యార్థులకు గాయాలయ్యాయంటే..? #trafic-police మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి