కౌంటింగ్ మెషీన్లే అలసిపోతున్నాయ్!.. ఒడిశాలో ఐదు రోజులుగా నోట్ల గుట్టల లెక్కింపు

ఒడిశాలో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన వివిధ స్థలాల్లో నోట్ల గుట్టల లెక్కింపు టెస్ట్ మ్యాచ్ మాదిరిగా ఐదు రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఏకంగా 50 మంది అధికారులు 40 యంత్రాలతో అక్కడ మోహరించి డబ్బుల కట్టలను లెక్కిస్తున్నారు.

New Update
కౌంటింగ్ మెషీన్లే అలసిపోతున్నాయ్!.. ఒడిశాలో ఐదు రోజులుగా నోట్ల గుట్టల లెక్కింపు

Bhuvaneshvar: ఒడిశాలో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన వివిధ స్థలాల్లో నోట్ల గుట్టల లెక్కింపు టెస్ట్ మ్యాచ్ మాదిరిగా ఐదు రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఏకంగా 50 మంది అధికారులు 40 యంత్రాలతో అక్కడ మోహరించి డబ్బుల కట్టలను లెక్కిస్తున్నారంటే అక్కడ కరెన్సీ గుట్టలు ఏ స్థాయిలో పేరుకుని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

సోమవారం బ్యాంకుల కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతున్నందున కౌంటింగ్ యంత్రాలను పంపించాల్సి ఉంది. దాంతో, ఆదివారం ఎలాగైనా ఆ కార్యక్రమమం మొత్తాన్నీ ముగించాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అదనపు సిబ్బంది, యంత్రాలను రంగంలోకి దించారు.

ఇది కూడా చదవండి: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆఫీస్ నుంచి సామాగ్రిని తరలించే యత్నం

స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ. 300 కోట్లకు చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకే ఆపరేషన్‌లో ఒక ఏజెన్సీ స్వాధీనం చేసుకున్న ‘అత్యధిక మొత్తం’ ఇదే కావడం విశేషం. తమకు 176 బ్యాగ్‌ల నగదు వచ్చిందని, వాటిలో 140 బ్యాగులు లెక్కించామని ఎస్బీఐ రీజినల్ మేనేజ్ భగత్ బెహెరా తెలిపారు. కౌంటింగ్ యంత్రాలకు ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు ఇంజినీర్లను కూడా అక్కడే అందుబాటులో ఉంచారు.

ఇది కూడా చదవండి: ఐపీఎల్‌ వేలంలో ఆమెకు జాక్‌పాట్‌.. ఎన్ని కోట్లో తెలుసా!

కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఆస్తుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు గుట్టలను అధికారులు లెక్కిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒడిశాలోని బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్‌ ప్రాంగణంలో అత్యధిక మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు కాంగ్రెస్ ధీరజ్ సాహు విషయం నుంచి పక్కకు తప్పుకున్నట్లు కనిపిస్తోంది. తమ పార్టీకి ఎంపీ ధీరజ్ సాహు వ్యాపారాలతో ఎలాంటి సంబంధం లేదని, ఈ వ్యవహారంపై ఆయనే వివరణ ఇవ్వగలరని, ఇచ్చి తీరాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఓ ట్వీట్ లో పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు