Abhaya Hastham: అభయహస్తం దరఖాస్తులపై కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు!

ఈనెల 5 నుంచి 17 వరకు అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ పూర్తి చేయాలని కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుదారుల వివరాల నమోదులో ఆధార్ నెంబర్, వైట్ రేషన్ కార్డు లను ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు.

New Update
Telangana : తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు!

ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ లను ఈనెల 17వ తేదీ వరకు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(Santhi Kumari) జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన నిర్వహణ, దారఖాస్తుల డాటా ఎంట్రీ లపై జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయితీలు, మున్సిపల్ వార్డుల్లో నిర్వహిస్తున్న గ్రామ సభలను ఏవిధమైన ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తుండడం పట్ల జిల్లా కలెక్టర్లను సి.ఎస్ అభినందించారు. ఈనెల 6న ప్రజాపాలన ముగిసిన వెంటనే అందిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. మండల రెవిన్యూ అధికారులు, మండల డెవలప్ మెంట్ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ డాటా ఎంట్రీ చేపట్టాలని, ప్రజాపాలన కార్యక్రమం సూపర్వైజరీ అధికారిగా ఉన్న జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షించాలని తెలిపారు.

ఆధార్ నెంబర్, వైట్ రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలి:
ఈ డాటా ఎంట్రీ చేపట్టేందుకుగాను జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర స్థాయిలో ట్రెయినీ అఫ్ ట్రైనర్ (TOT ) లకు 4 వ తేదీన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ TOT లు జిల్లా స్థాయిలో డాటా ఎంట్రీ ఏవిధంగా చేయాలన్న దానిపై 5 వ తేదీన శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ఈనెల 5 నుంచి 17 వరకు అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ పూర్తి చేయాలని, ఈ డాటా ఎంట్రీ సందర్బంగా, దరఖాస్తుదారుల వివరాల నమోదులో ఆధార్ నెంబర్, వైట్ రేషన్ కార్డు లను ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకుగాను, జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న డీ.టి.పి ఆపరేటర్ల సేవలను ఉపయోగించుకోవాలని, అవసరమైతే ప్రయివేటు ఆపరేటర్లను హైర్ చేసుకోవాలని సి.ఎస్ సూచించారు. నిన్నటి వరకు దాదాపు 57 లక్షల దారఖాస్తులు అందాయని తెలిపారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినందున, దరఖాస్తు ఇవ్వని వారు, మరోసారి తిరిగి దారఖాస్తులు అందచేయవచ్చని తెలియ చేశారు.

ఈ టెలీ కాన్ఫరెన్స్ లో రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, జీహెచ్ ఎంసీ కమీషనర్ రోనాల్డ్ రోస్,పంచాయితీ రాజ్ కమీషనర్ హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.

Also Read: హోటల్‌ లో మాజీ మోడల్‌ హత్య..మృతదేహంతో పారిపోయిన నిందితుడు!

#santhi-kumari
Advertisment
Advertisment
తాజా కథనాలు