Samantha Ruth Prabhu: సమంత (Samantha Ruth Prabhu) గురించి తెలుగు వారికి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. అందానికి అందం, నటనకు నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. సుదీర్ఘ కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించింది. సాదాసీదాగానే సినిమాల్లోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది.
అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగుతోంది. సమంత ఇటీవల శాకుంతలం అనే చిత్రంతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో ఖుషి అనే సినిమా చేసింది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ప్రకటించింది. తన మయోసైటిస్(Myositis) చికిత్స కోసం, తన ఆరోగ్యం కోసం పలు దేశాలు తిరిగి ఇటీవలే హైదరాబాద్ కు వచ్చింది. అటు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూనే ఇటు మనసు ఆహ్లాదం కోసం ప్రకృతిని ఆస్వాదిస్తోంది.
ప్రతి చోట ఏదో ఒక ప్రకృతి వైద్యం ట్రై చేసింది సమంత. అయితే అవన్నీ కూడా మయోసైటిస్ కోసమేనా లేక వేరే ఇంకేమైనా ఆరోగ్య సమస్యలకా అనేది తెలియదు. తాజాగా క్రయోథెరపీ(Cryotherapy) అనే ఓ వైద్యాన్ని తీసుకుంటుంది. ఇందులో ఒక పెద్ద స్టీల్ ఫ్రీజర్ లాంటి దాంట్లో మంచు ఆవిరితో చలిలో నిల్చుంది. ఇందులో మైనస్ డిగ్రీస్ లో ఉష్ణోగ్రత ఉంటుందని సమాచారం. ఈ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.
క్రయోథెరపీ అనేది అత్యంత చల్లటి ఉష్ణోగ్రతలో చేసే ఒక చికిత్స. గడ్డకట్టించేంత ఉష్ణోగ్రతలో పేషెంట్లకు చికిత్స చేస్తారు. రోగులు క్రయోజనిక్ టబ్ లో కొన్ని నిమిషాల పాటు ఉండాల్సి ఉంటుంది. దీని వల్ల మయోసైటిస్ వల్ల వచ్చిన కండరాల నొప్పి, వాపు వంటి సమస్యలు తగ్గుతాయి. మయోసైటిస్ కు ఇది మంచి థెరపీ అని వైద్య నిపుణులు చెపుతారు. అనారోగ్యపూరితమైన కణజాలాన్ని ఈ థెరపీ నాశనం చేస్తుంది.
పలు క్యాన్సర్ల చికిత్సలకు కూడా ఈ థెరపీని నిర్వహిస్తుంటారు. బోన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, ప్రారంభ దశలో ఉన్న స్కిన్ క్యాన్సర్ తదితర చికిత్సలకు ఈ థెరపీని చేస్తారు. కొంచె నొప్పిగా ఉన్నా ఈ థెరపీ మంచి ఫలితాలను ఇస్తుందని చెపుతారు. అత్యంత చల్లదనం వల్ల అనారోగ్య కణజాలం నశిస్తుంది.
చర్మం వెలుపల ఉన్న టిష్యూలతో పాటు, శరీరంలోని టిష్యూలను కూడా ఈ థెరపీ ద్వారా ట్రీట్ చేయవచ్చు. ఈ చికిత్సలో అత్యంత చల్లదన్నాన్ని సృష్టించేందుకు లిక్విడ్ నైట్రోజన్, ఆర్గాన్ గ్యాస్ లను వాడతారు. లెవెల్స్ ని బట్టి మైనస్ 85 నుంచి మైనస్ 140 డిగ్రీల సెల్సియస్ వద్ద చికిత్స కొనసాగుతుంది. పేషెంట్ కండిషన్ ను బట్టి లోకల్ అనస్తీషియా లేదా జనరల్ అనస్తీషియాను ఇస్తారు.
ఆమె తన చివరి సినిమా 'ఖుషీ' ప్రచారాల్లో పాల్గొంది. ఇందులో విజయ్ దేవరకొండ (VijayDeverakonda) కథానాయకుడు. ఆ తరువాత వెంటనే అమెరికా వెళ్ళింది, అక్కడ విశ్రాంతి తీసుకుంటూ పలు నగరాలను సందర్శించింది. అవన్నీ కూడా తన అభిమానులకు ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఫోటోస్ పోస్ట్ చేస్తూ వస్తోంది. అమెరికా నుండి ముంబై వచ్చి అక్కడ కొన్ని ఫోటోషూట్ చేసింది. అవన్నీ కూడా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది.