Petrol and diesel Price: క్రూడాయిల్ ధరలు తగ్గాయి.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయంటే . .

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గాయి. అయితే, మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది. 

New Update
Petrol Prices in Budget : లీటర్‌ పెట్రోల్‌పై రూ.10 తగ్గింపు..? మధ్యంతర బడ్జెట్‌వైపే అందరి చూపు!

Petrol and diesel Price: వరుసగా రెండోరోజూ అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుదల కనబరుస్తున్నాయి.  ప్రస్తుతం అంటే ఈ ఉదయం (08.09.2024) 6:30 గంటల సమయానికి  అంతర్జాతీయ మార్కెట్‌లో బెంట్ ముడి చమురు బ్యారెల్‌కు 71.06డాలర్లుగా ఉంది. WTI ముడి చమురు 67.67 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక పెట్రోలు, డీజిల్ ధరలు మార్పులు లేకుండా  ఉన్నాయి.

Petrol and diesel Price: ముడి చమురు ప్రధాన దిగుమతిదారుగా, భారతదేశం పెట్రోల్, డీజిల్ ధరలు భారత్, US డాలర్ మధ్య మారకం రేటు ద్వారా ప్రభావితమవుతాయి. పెట్రోల్‌, డీజిల్‌కు డిమాండ్‌ కూడా వాటి ధరలపై ప్రభావం చూపుతుంది. ఈ ఇంధనాలకు డిమాండ్ పెరిగితే, అది అధిక ధరలకు దారితీయవచ్చు.

Petrol and diesel Price: పెట్రోలు - డీజిల్ ధర ముడి చమురును శుద్ధి చేయడానికి అయ్యే ఖర్చుతో ప్రభావితం అవుతుంది. శుద్ధి ప్రక్రియ ఖరీదైనది అలాగే ఉపయోగించిన ముడి చమురు రకం,  రిఫైనరీ సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా శుద్ధి ఖర్చులు మారవచ్చు.

ఇక పెట్రోల్, డీజిల్ ధరలు మన దేశంలో ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. స్థానికంగా ఉండే పన్నులు, రవాణా ఛార్జీలు ఆధారంగా వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ఉంటాయి. 

ఈరోజు అంటే 08.09.2024 ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.72, డీజిల్ ధర రూ.87.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.44, డీజిల్ ధర రూ.89.97గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.95, డీజిల్ ధర రూ.91.76గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.75, డీజిల్ ధర రూ.92.34గా ఉంది.

నోయిడా: లీటర్ పెట్రోల్ రూ. 94.83, డీజిల్ రూ. 87.96 గురుగ్రామ్: లీటర్ పెట్రోల్ రూ. 95.19, డీజిల్ రూ. 88.05. బెంగళూరు: లీటర్ పెట్రోల్‌ రూ.102.86, డీజిల్‌ రూ.88.94. చండీగఢ్: లీటర్ పెట్రోల్ రూ.94.24, డీజిల్ లీటర్ రూ.82.40, హైదరాబాద్: లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65. జైపూర్: లీటర్ పెట్రోల్ రూ.104.88, డీజిల్ రూ.90.36. పాట్నా: లీటర్ పెట్రోల్ రూ.105.18, డీజిల్ రూ.92.04.

Advertisment
తాజా కథనాలు