Konaseema : ఐకమత్యమే మహా బలం అంటారు పెద్దలు. కానీ ఈ కాలంలో మనుషుల్లో ఐకమత్యం అనేది కరువైపోయింది. ఎవరికి వారే యమున తీరు అన్నట్లు బ్రతుకుతున్నారు. కానీ, కాకులు మాత్రం తమ ఐకమత్యాన్ని చాటుకున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.
Also Read: చట్నీలో పడిన ఎలుక కోసం వెళ్లిన పిల్లి.. బీఆర్ఎస్ నేత సెటైరికల్ ట్వీట్..!
తాటిపాక డైలీ మార్కెట్లో కాకులు ఐక్యతను చాటుకున్నాయి. మార్కెట్లోని ఓ చికెన్ సెంటర్ దగ్గర ఓ కాకి గోల చేస్తుండడంతో విసుగు చెందిన యజమాని కాకిని పట్టుకొని తాడుతో కట్టేశాడు. అక్కడి నుండి తప్పించుకోవడానికి ఆ కాకి చాలా ప్రయత్నించింది. అయితే తప్పించుకోవడానికి కుదరకపోవడంతో అటు ఇటు కదులుతూ అరవడం మొదలుపెట్టింది.
Also Read: కుక్కల దాడికి బాలుడు బలి.. సీఎం కీలక ఆదేశాలు.. వీధికుక్కల దాడిపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్..!
కాకిని బంధించడాన్ని చూసిన వందలాది కాకులు అక్కడకు చేరుకున్నాయి. చికెన్ సెంటర్ చుట్టూ చేరి ఒకటే గోల చేశాయి. ఆ గోలను మిగిలిన దుకాణదారులు భరించలేకపోయారు. దీంతో ఆ చికెన్ సెంటర్ యజమాని చేసేదేమి లేక చివరికి కట్టేసిన కాకిని వదిలేశాడు.