AP: కాకిని కట్టేసిన చికెన్ సెంటర్ యజమాని.. చివరికి ఏం జరిగిందంటే? కోనసీమ జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. తాటిపాక డైలీ మార్కెట్లో కాకులు ఐక్యతను చాటుకున్నాయి. మార్కెట్లో విసిగిస్తున్న ఓ కాకిని చికెన్ సెంటర్ యజమాని తాడుతో కట్టేశాడు. దీంతో వందలాది కాకులు అక్కడకు చేరుకుని ఒకటే గోల చేయడంతో కట్టేసిన కాకిని యజమాని వదిలేశాడు. By Jyoshna Sappogula 17 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Konaseema : ఐకమత్యమే మహా బలం అంటారు పెద్దలు. కానీ ఈ కాలంలో మనుషుల్లో ఐకమత్యం అనేది కరువైపోయింది. ఎవరికి వారే యమున తీరు అన్నట్లు బ్రతుకుతున్నారు. కానీ, కాకులు మాత్రం తమ ఐకమత్యాన్ని చాటుకున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. Also Read: చట్నీలో పడిన ఎలుక కోసం వెళ్లిన పిల్లి.. బీఆర్ఎస్ నేత సెటైరికల్ ట్వీట్..! తాటిపాక డైలీ మార్కెట్లో కాకులు ఐక్యతను చాటుకున్నాయి. మార్కెట్లోని ఓ చికెన్ సెంటర్ దగ్గర ఓ కాకి గోల చేస్తుండడంతో విసుగు చెందిన యజమాని కాకిని పట్టుకొని తాడుతో కట్టేశాడు. అక్కడి నుండి తప్పించుకోవడానికి ఆ కాకి చాలా ప్రయత్నించింది. అయితే తప్పించుకోవడానికి కుదరకపోవడంతో అటు ఇటు కదులుతూ అరవడం మొదలుపెట్టింది. Also Read: కుక్కల దాడికి బాలుడు బలి.. సీఎం కీలక ఆదేశాలు.. వీధికుక్కల దాడిపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్..! కాకిని బంధించడాన్ని చూసిన వందలాది కాకులు అక్కడకు చేరుకున్నాయి. చికెన్ సెంటర్ చుట్టూ చేరి ఒకటే గోల చేశాయి. ఆ గోలను మిగిలిన దుకాణదారులు భరించలేకపోయారు. దీంతో ఆ చికెన్ సెంటర్ యజమాని చేసేదేమి లేక చివరికి కట్టేసిన కాకిని వదిలేశాడు. #konasema మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి