/rtv/media/media_files/2026/01/16/illegal-websites-2026-01-16-20-21-32.jpg)
Illegal Websites
యువత ఆర్థికంగా నష్టపోవడం, బెట్టింగ్ నేరుగా మానసిక, ఆర్థిక సమస్యలకు దారి తీస్తున్న కారణంగా కేంద్రం చర్యలకు దిగింది. గతేడాది అక్టోబర్‌లో కేంద్రం ఆన్‌లైన్ గేమింగ్ అక్ట్, 2025ను ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం నగదుతో ముడిపడిన ఆన్‌లైన్ గేమ్స్‌కు నిషేధం విధించారు.
కేంద్రం చర్యలతో వింజో, నజారా టెక్నాలజీస్ వంటి ప్రముఖ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్ రియల్ మనీ గేమ్స్ ఆపేసాయి. వెబ్‌సైట్లను బ్లాక్ చేయడం ద్వారా యువతకు రక్షణగా, ఆర్థిక సమస్యలు తక్కువ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ చర్యతో కేంద్రం ఆన్‌లైన్ జూదంపై క్రమంగా గట్టి నిబంధనలు అమలు చేస్తోంది.
Follow Us