/rtv/media/media_files/2025/12/07/insta-viral-video-2025-12-07-09-59-31.jpg)
Insta Viral Video
Insta Viral Video: ఇటీవల ఇంటర్నెట్లో ఒక 19-నిమిషాల వైరల్ వీడియో చాలా వైరల్ అయ్యింది. ఈ వీడియోను ఎక్కువ మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, X (ముందు ట్విట్టర్) లో షేర్ చేస్తున్నారు. కానీ ఈ వీడియోను వాడుకొని కొంతమంది హ్యాకర్లు, స్క్యామర్లు వినియోగదారుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఈ వీడియో బాగా వైరల్ కావడంతో అదే అదునుగా చేసుకొని మాల్వేర్ (దొంగ సాఫ్ట్వేర్) ని పంపుతున్నారు.
ఈ 19-నిమిషాల వీడియోలో ఒక యువ జంట ప్రైవేట్ గా ఉన్న క్లిప్ ఉంది. కానీ ఈ వీడియో నిజంగా ఎక్కడ నుండి వచ్చింది అనే సమాచారం తెలియదు. నవంబర్ చివరి వారంలో ఇది ఇంటర్నెట్లో ఫుల్ వైరల్ అయింది.
స్క్యామర్లు వీడియోను ఎలా ఉపయోగిస్తున్నారు? Insta Couple 19 mins Viral Video
వైరల్ వీడియోపై క్యూరియాసిటీ పెరగడం వల్ల, స్క్యామర్లు జనాలను తప్పుదారి పట్టే లింక్‌లను పంపుతున్నారు. వీడియో చూడాలనుకునే వారు ఆ లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే, వారి ఫోన్లు లేదా కంప్యూటర్లలో మాల్వేర్ ఇన్స్టాల్ అవుతుంది.
ఈ మాల్వేర్ ప్రత్యేకంగా వ్యక్తిగత సమాచారం, ముఖ్యంగా బ్యాంక్ ఖాతా వివరాలు దోపిడి చేయడానికి రూపొందించారు. వినియోగదారులు ఈ లింక్‌లను క్లిక్ చేసిన తర్వాత, వారి ఖాతా వివరాలు సైబర్ దొంగల చేతికి వెళ్తాయి. దీనివల్ల ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది అలాగే ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం కూడా ఉంది.
అదేవిధంగా, స్క్యామర్లు ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లను కూడా సృష్టిస్తున్నారు. ఆ అకౌంట్లు ద్వారా వారు వినియోగదారులను మాల్వేర్ లింక్‌లను క్లిక్ చేయడానికి ప్రేరేపిస్తున్నారు.
సురక్షితంగా ఉండాలంటే..!
నమ్మకంలేని లింక్‌లను క్లిక్ చేయకండి. ఇతరుల వ్యక్తిగత వీడియోల కోసం వెతకడం వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది. మీ డివైస్‌లో అప్డేట్ అయిన ఆంటీవైరస్ ఉపయోగించండి. అకౌంట్ డీటెయిల్స్ ఎవరితోనూ పంచుకోకండి.
ముఖ్యంగా, సోషల్ మీడియాలో “వైరల్” అయిన వీడియోలపై వేగంగా క్లిక్ చేయడం వల్లనే మనం సమస్యలో పడతాము. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, నమ్మకమైన మూలాల ద్వారా మాత్రమే వీడియోలు చూడాలి.
Follow Us