పండగ పూట పెను విషాదం.. రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకుల మృతి!

నిర్మల్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. నర్సాపూర్‌ మండలం చాక్పెల్లి వద్ద ఓ కుటుంబం వెళ్తున్న కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రి సురేశ్‌ (27), కుమారుడు దీక్షిత్‌ (7) అక్కడిక్కడే మృతి చెందారు. సురేశ్‌ భార్య, కుమార్తెకు తీవ్రగాలయ్యాయి.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

Nirmal district

Nirmal district:  పండగ పూట నిర్మల్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకులు అక్కడిక్కడే మరణించారు. అదే కారులో ఉన్న భార్య, కుమార్తె తీవ్ర గాయాలపాలయ్యారు. 

Also Read: ప్రియుడి కోసం లండన్ నుంచి హైదరాబాద్‌కు.. తర్వాత ఏమైందంటే?

రోడ్డు ప్రమాదం 

సురేశ్‌ (27) అతని కుటుంబ సభ్యులతో కారులో  బోథ్‌ మండలం కుచ్లాపూర్‌ నుంచి లోకేశ్వరం మండలం మన్మద్‌ వెళ్తుండగా..  నర్సాపూర్‌ (బి) మండలం చాక్పెల్లి వద్ద కారును  చెట్టును ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో సురేశ్‌ (27), అతని కుమారుడు దీక్షిత్‌ (7) అక్కడిక్కడే మృతి చెందారు. సురేశ్‌ భార్య, కుమార్తెకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

Also Read:  సీఐ తల్లి హత్య కేసులో ట్విస్ట్.. హంతకుడిని స్విగ్గీ ఎలా పట్టించిందంటే?

Advertisment
తాజా కథనాలు