కానిస్టేబుల్‌తో SI రాసలీలలు.. కాల్ రికార్డింగ్ వైరల్ ! నల్గొండ జిల్లాలో టాస్క్ ఫోర్స్ ఎస్సై మహేందర్ వివాహేతర సంబంధం పెట్టుకొని అడ్డంగా దొరికిపోయాడు. కొన్నాళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో మహేందర్ ఎఫైర్ సాగిస్తున్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో భర్త మహేందర్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. By Archana 30 Dec 2024 in క్రైం Latest News In Telugu New Update Nalgonda SI Illegal Affair షేర్ చేయండి Nalgonda Incident: పోలీస్ శాఖలో అక్రమ సంబంధాల ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వివాహేతర సంబంధాలు పెట్టుకొని.. అది బయట పడేసరికి పరువు పోతుందేమో అనే భయంతో అబాసుపాలవుతున్నారు కొందరు ఖాకీలు. ఇటీవలే కామారెడ్డిలో జరిగిన ఎస్సై, లేడీ కానిస్టేబుల్, ఆపరేటర్ ట్రయాంగిల్ డెత్ మిస్టరీ వీడక ముందే.. నల్గొండలో మరో ఎస్సై వివాహేతర సంబంధం బయటపడింది. కానిస్టేబుల్ తో ఎఫ్ఫైర్ పెట్టుకొని తనని, పిల్లల్నిరోడ్డున పడేశాడని ఎస్సై భార్య గుండెలు బాదుకుంటుంది. Also Read: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు? నల్గొండలో టాస్క్ ఫోర్స్ ఎస్సై రాసలీలలు.. నల్గొండ జిల్లాలో మహేందర్ అనే వ్యక్తి టాస్క్ ఫోర్స్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే మహేందర్ కొన్ని రోజులుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉన్నాడు. విషయం తెలుసుకున్న భార్య మహేందర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భర్త విషయంలో కానిస్టేబుల్ వసంతను వారించే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి కాల్ రికార్డింగ్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. మరోవైపు భర్త పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ పట్టించుకోకపోవడంతో RTVని ఆశ్రయించింది. కానిస్టేబుల్ మోజులో పడి తనను, ఇద్దరు పిల్లల్ని రోడ్డున పడేశాడని ఎస్సై భార్య ఆవేదన వ్యక్తం చేసింది. Also Read: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు? మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి