/rtv/media/media_files/2024/12/28/N5JNwOMvCzUnaX9k8vq6.jpg)
Fire Accident
Fire Accident: హైదరాబాద్ మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాంలోని కెమికల్స్ నిల్వ ఉంచిన ప్రదేశంలో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడడంతో చుట్టూ పక్కల ప్రాంతమంతా దట్టమైన పొగతో అలుముకుంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో దాదాపు కోటి రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అదృస్టవశాత్తు ఎలాంటి ప్రాణహాని జరగలేదని సమాచారం.
Follow Us