Crime: దారుణం.. పదివేల కోసం బెస్ట్ ఫ్రెండ్ ని బండరాయితో కొట్టి..! ఏం చేశాడంటే

పదివేల కోసం స్నేహితుడిని బండరాయితో కొట్టి చంపాడు ఓ వ్యక్తి!  దువ్వూరు మండలం భీమునిపాడు గ్రామంలో జరిగిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

New Update
crime

crime

Crime: ఈ మధ్య సమాజంలో నార్ల, ఘోరాల సంఖ్య బాగా పెరిగిపోయింది. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్తున్నారు. పగ, ప్రతీకారాలు, డబ్బు, ఆస్తుల కోసం సొంతవారిని కూడా చంపడానికి వెనకాడడం లేదు! తాజాగా ఇలాంటి మరో ఘటన వెలుగు చూసింది. పదివేల కోసం స్నేహితుడిని బండరాయితో కొట్టి చంపాడు ఓ వ్యక్తి!  దువ్వూరు మండలం భీమునిపాడు గ్రామంలో జరిగిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే .. దివాకర్ అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం తన స్నేహితుడు దస్తగిరికి పదివేల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అయితే డబ్బు తిరిగి ఇవ్వాలని దివాకర్ పలు మార్లు అడిగినా పట్టించుకోలేదు. ఈరోజు ఉదయం మరోసారి గట్టిగా అడిగాడు. దీంతో క్షణికావేశానికి లోనైన దస్తగిరి దారుణానికి పాల్పడ్డాడు. డబ్బు గట్టిగా అడిగాడన్న కోపంతో దివాకర్ ని బండరాయితో  బలంగా కొట్టాడు. దీంతో  చుట్టు పక్కన ఉన్నవారు వెంటనే దివాకర్ ని ఆస్పత్రికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. తలకు దెబ్బ గట్టిగా తగలడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.  మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

భూ వివాదం

ఇదిలా ఉంటే.. ఇటీవలే రంగారెడ్డి జిల్లాలో భూవివాదం గొడవ ఒకరి ప్రాణం తీసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం దండుమైలా గ్రామానికి చెందిన గుడేటి నర్సింహ, యాదయ్య, మల్లయ్య, జంగయ్య అన్నదమ్ములకు 18.12 ఎకరాల భూమి ఉంది. ఇందులో ఒక్కొక్కరికి 4.23 ఎకరాల భూమి రావాల్సి ఉండగా.. నర్సింహా, యాదయ్యలకు దాని కంటే ఎక్కువ వచ్చింది. దీంతో అన్నదమ్ముల మధ్య భూమి పంచాయతీ మొదలైంది. అయితే కొంతకాలం క్రితం యాదయ్య మృతి చెందగా ఈ వివాదం ఆయన కుమారుల చేరింది. యాదయ్య, నరసింహాల పేరు పై అదనంగా ఉన్న భూమి తమకే చెందాలని మల్లయ్య, జంగయ్య కుమారులు కొంతకాలంగా కోరుతున్నారు. కానీ దీనికి నరసింహా, యాదయ్యల కొడుకులు ఒప్పుకోకపోవడంతో తరచు ఇరువురి మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఈ భూ వివాదానికి సంబంధించి గతేడాది పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఇబ్రహీంపట్నం పరిధికి చెందిన వీఆర్వో వివాదంలో ఉన్న భూమి జోలికి ఎవరూ వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు.  

అయినప్పటికీ లెక్కచేయని నర్సింహ, యాదయ్య కుటుంబీకులు ఆదివారం వరినాట్లు వేయడానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మల్లయ్య కుమారులు బాల్‌రాజ్‌, అతని భార్య పావని, సోదరుడు పర్వతాలు, అతని భార్య మంజుల.. జంగయ్య కుమారులు ధన్‌రాజ్‌, వెంకట్‌ వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య పెద్ద గొడవ జరిగింది. నరసింహా, యాదయ్య కుటుంబీకులు కొడవల్లు, గొడ్డలతో దాడి చేసి రక్తపాతం స్ట్రస్టించారు. ఈ గొడవలో మల్లయ్య కుమారుడు బాలరాజు మృతి చెందగా.. పర్వతాలు, అతని భార్య మంజుల పరిస్థితి విషమంగా ఉంది. మిగతా వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇలా ఆస్తుల కోసం రక్త సంబంధీకులను చంపుకోవడం సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.

Advertisment
తాజా కథనాలు