Credit Health: పాతికేళ్లకే క్రెడిట్ కార్డు.. క్రెడిట్ కార్డుల వాడకం మామూలుగా లేదు.. 

మన దేశంలో 25 ఏళ్లకే 24 శాతం మంది క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారు. అలాగే పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నవారిలో కూడా 22% పాతికేళ్ల వారే. 

New Update
Credit Health: పాతికేళ్లకే క్రెడిట్ కార్డు.. క్రెడిట్ కార్డుల వాడకం మామూలుగా లేదు.. 

Credit Health:  దేశంలో పెరుగుతున్న ఫైనాన్షియల్ ఇంక్లూషన్ కారణంగా లోన్స్ అలాగే ఇతర క్రెడిట్స్ పొందడం చాలా ఈజీగా మారిపోయింది. భారతీయులు హోమ్ లోన్స్ నుంచి  కారు - ఇల్లు కొనుగోలు వరకు తక్షణ అవసరాలకు లోన్ తీసుకోవడం మంచి ఆప్షన్ గా భావిస్తున్నారు. 

మన దేశంలో క్రెడిట్ కార్డు పొందుతున్న(Credit Health)సగటు వయసు 28 సంవత్సరాల వయస్సులోపుగా ఉంది. వీరిలో 57% మంది 30 ఏళ్ల లోపు, 24% మంది 25 ఏళ్ల లోపు క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. అయితే 53% మంది భారతీయులు తమ మొదటి హోమ్ లోన్  30 ఏళ్లలోపు తీసుకుంటారు. వీరిలో 22% మంది 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఉంటున్నారు. అంటే లోన్స్ లేదా క్రెడిట్ కార్డు తీసుకుంటున్నవారిలో 25 ఏళ్ల లోపు వారు దాదాపు నాలుగో వంతు ఉంటున్నారు. 

క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లలో 64% మంది తమ క్రెడిట్ ప్రోడక్ట్(Credit Health)ను  30 ఏళ్లలోపు తీసుకున్నారు.  వీరిలో 37% మంది 25 ఏళ్ల లోపు వారే. వీరిలో 24% మంది వినియోగదారులు 25 ఏళ్లలోపు వారే. ఈ సమాచారం మనీ మార్కెట్ అధ్యయనంలో వెలువడింది. 

హోమ్ లోన్ తీసుకుంటున్నవారు ఈ వయసువారే.. 

3.7 కోట్ల మంది క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై(Credit Health)ఈ ఫైనాన్స్ కంపెనీ అధ్యయనం చేసింది. దేశంలో మొదటిసారిగా హోమ్ లోన్ తీసుకునేవారిలో, 45% మంది 30 నుంచి  40 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. అయితే, వారి సగటు వయస్సు 33 సంవత్సరాలు. 30 సంవత్సరాల సగటు వయస్సు ఉన్న వినియోగదారులు రెండు కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లు అలాగే  1 పర్సనల్ లోన్ తీసుకుంటున్నారు.

Also Read: దీపావళికి  బోనస్ వచ్చిందా?  టాక్స్ ఎంత కట్టాలో తెలుసా? 

వీరే ఎక్కువగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకుంటున్నారు
తమ క్రెడిట్ స్కోర్‌లను చెక్ చేసుకునే వారి సంఖ్య కూడా పెరిగిందని అధ్యయనం వెల్లడించింది. పైసా బజార్ ప్లాట్‌ఫారమ్‌లో 52% మంది 30 నుంచి 40 ఏళ్లలోపు వారి క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసుకున్నారు.  30 ఏళ్లలోపు 14% మంది తమ క్రెడిట్ స్కోర్ పై అప్రమత్తంగా ఉన్నారు. 

బెంగుళూరు అత్యంత క్రెడిట్- హెల్దీ సిటీ

ఈ అధ్యయనం క్రెడిట్ హెల్త్(Credit Health)పరంగా దేశంలోని నగరాలను కూడా ర్యాంక్ చేసింది. ఇందులో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత, అహ్మదాబాద్, ముంబై, పూణే, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, సూరత్,  కోయంబత్తూర్ అత్యంత క్రెడిట్-హెల్దీ సిటీలుగా ఉన్నాయి. 

క్రెడిట్ స్కోర్ అనేది 300 నుంచి  900 వరకు ఉండే స్కేల్, దీని ఆధారంగా లోన్ లేదా క్రెడిట్ ఇచ్చే సంస్థ మీకు లోన్ ఇవ్వాలా వద్దా అని నిర్ణయిస్తుంది. మీ క్రెడిట్ స్కోర్ 770 కంటే ఎక్కువ ఉంటే, అది ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారు. దేశంలో ఉద్యోగాలు చేసే  వినియోగదారుల క్రెడిట్ స్కోర్ 770.

కేవలం 12% మంది మహిళలు మాత్రమే..
ఈ రీసెర్చ్ లో  స్త్రీ, పురుషుల క్రెడిట్ హెల్త్(Credit Health)లో పెద్దగా  తేడా కనిపించలేదు. 20% మంది పురుషులు మంచి క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉండగా, 19% మంది మహిళా వినియోగదారులు కూడా ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉన్నారు. అయితే, చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే  మొత్తం కార్డ్ యూజర్ బేస్‌లో పురుషులు 88% మంది ఉండగా, మహిళల సంఖ్య 12% మాత్రమే.

Watch this interesting video:

Advertisment