CPM Sitaram: ఇలా చేయడం దురదృష్టకరం.. జగన్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి..!

ఆరోగ్యశ్రీ సేవలను ఆసుపత్రి వర్గాలు నిలిపివేయడం దురదృష్టకరమన్నారు సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీతారాం. పేదల పక్షాన నిలబడే ప్రభుత్వం అని బీరాలు పలికే జగన్ దీనికి సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం దాదాపు రూ.1500 కోట్లు ఆసుపత్రులకు చెల్లించాలని వెల్లడించారు.

New Update
CPM Sitaram: ఇలా చేయడం దురదృష్టకరం.. జగన్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి..!

CPM Sitaram : సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీతారాం RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. పేదలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ సేవలను ఆసుపత్రి వర్గాలు నిలిపివేయడం దురదృష్టకరమన్నారు. పేదల పక్షాన నిలబడే ప్రభుత్వం అని బీరాలు పలికే జగన్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఐదేళ్లలో దాదాపు రూ.1500 కోట్లు ఆసుపత్రులకు చెల్లించాలన్నారు.

Also Read: పేరుకుపోయిన చెత్తకుప్పలు.. విజృంభిస్తున్న వ్యాధులు..!

ఎప్పుడూ మొక్కుబడి చర్యలే తప్ప ఆరోగ్యశ్రీ పై ప్రభుత్వం ఏనాడు దృష్టి పెట్టలేదని విమర్శలు గుప్పించారు. కేవలం డబ్బులు పంపిణీ చేయడం మాత్రమే సంక్షేమం కాదని పేర్కొన్నారు. ఇలాంటి సేవలని కూడా సమర్థవంతంగా నడిపించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి పూర్తి బకాయిలు చెల్లించాలని సూచించారు.

Advertisment
తాజా కథనాలు