CPM Contest in Telangana Elections: కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పిన కమ్యూనిస్ట్ పార్టీ సీపీఎం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) పోటీకి సై అంది. మొత్తం 20 స్థానాల్లో పోటీ చేస్తామన్న సీపీఎం(CPM) ప్రస్తుతానికి 17 స్థానాలకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. సీపీఎం పోటీ చేసే నియోజకవర్గాల పేర్లను వెల్లడించారు. త్వరలోనే అభ్యర్థులను కూడా ఖరారు చేస్తామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామన్నారు.
ఇదే విషయమై గురువారం నాడు మీడియాతో మాట్లాడిన తమ్మినేని వీరభద్రం.. ఎన్నికల్లో పోటీ, కాంగ్రెస్‌తో పొత్తులపై సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నేతల వైఖరి సీపీఎంను ఎంతో బాధించిందన్నారు. కమ్యూనిస్టులకు విలువ ఇవ్వలేదని, అందుకే కాంగ్రెస్‌తో సీసీఎం పొత్తు ఉండదని స్పష్టం చేశారు తమ్మినేని. పొత్తు లేకుండానే విడిగా పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించిందన్నారు.
ఇదికూడా చదవండి: ఆర్జీవీకి బిగ్ షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డు.. వ్యూహం సినిమాకు నో పర్మీషన్..!
కాంగ్రెస్ గురించి తమ్మినేని ఏమన్నారంటే..
'పొత్తులో భాగంగా భద్రాచలం, పాలేరు ఇవ్వాలని మొదట్లో అడిగాం. వైరా, మిర్యాలగూడ ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఆ తరువాత ఇస్తామన్న సీట్లపై కూడా కాంగ్రెస్ మాట తప్పింది. కాంగ్రెస్ వైఖరి వల్లే పొత్తు వద్దనుకుంటున్నాం. మొదట భద్రాచలం ఇస్తామని చెప్పి మాట తప్పారు. తర్వాత పాలేరు విషయంలో మేమే తగ్గాం. వైరా ఇస్తామని చెప్పి.. ఆ తరువాత అలా అనలేదని భట్టి అబద్ధం చెప్పారు. పొత్తుపై చర్చల్లో భాగంగా ఎన్నోమెట్లు దిగి వచ్చాం. ఇప్పుడేమో మిర్యాలగూడతో పాటు హైదరాబాద్‌లో ఒక స్థానం ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ నేతల వైఖరి మమ్మల్ని ఎంతో బాధించింది. కమ్యూనిస్టులకు విలువ ఇవ్వడం లేదు. అందుకే కాంగ్రెస్‌తో సీసీఎం పొత్తు ఉండదు. పొత్తు లేకుండానే విడిగా పోటీ చేయాలని నిర్ణయించాం. అలాగే, సీపీఐ పోటీ చేసే స్థానాల్లో వారికే మద్ధతు ఇస్తాం. బీజేపీ ఒక్క సీటు గెలవకూడదనేదే మా ప్రయత్నం. బీజేపీ గెలిచే అవకాశాలున్న చోట కచ్చితంగా పోటీ చేస్తాం.' అని తమ్మినేని వీరభద్రం అన్నారు.
సీపీఎం పోటీ చేయనున్న స్థానాలు ఇవే..
👉 ఖమ్మం: పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి.
👉 భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం, అశ్వారావుపేట.
👉 నల్లగొండ: మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్.
👉 యాదాద్రి భువనగిరి: భువనగిరి.
👉 సూర్యాపేట: హుజూర్‌నగర్, కోదాడ.
👉 జనగామ: జనగామ.
👉 రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం.
👉 సంగారెడ్డి: పటాన్‌చెఱు.
👉 హైదరాబాద్: ముషీరాబాద్.
ఇదికూడా చదవండి: చంద్రబాబుకు తెలంగాణ పోలీసుల షాక్.. కేసు నమోదు!