Hyderabad: పోస్టింగుల కోసం రాజకీయాలొద్దు.. సిబ్బందికి సీపీ హెచ్చరిక

పోలీసులకు పోస్టింగులపై సీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. సిఫార్సు లేఖలు, రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాంటి పనులు చేస్తే ఏమాత్రం ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పారు. సమర్థులనే విధుల్లో ఉంచుతామని స్పష్టంచేశారు.

New Update
Hyderabad: పోస్టింగుల కోసం రాజకీయాలొద్దు.. సిబ్బందికి సీపీ హెచ్చరిక

Hyderabad: పోలీసులకు పోస్టింగులపై సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సిఫార్సు లేఖలు, రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాంటి పనులు చేస్తే ఏమాత్రం ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పారు. సమర్థులనే విధుల్లో ఉంచుతామని స్పష్టంచేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన, నేరాలతో సంబంధం ఉన్న 8మందిపై కేసులు నమోదవగా, ఏడుగురిని సర్వీసు నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. మరికొంత మందిపై కూడా విచారణ జరుగుతోందని, తప్పు చేస్తే ఎవరిపై అయినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

నగరంలో పెరిగిన క్రైమ్ రేటు

గతేడాదితో పోలిస్తే 2023లో హైదరాబాద్ నగరంలో క్రైమ్ రేటు పెరిగిందట. నగరంలో నేరాలకు సంబంధించి సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి శనివారం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడించారు. నగరంలో మొత్తంగా క్రైమ్ రేటు 2శాతం వరకూ పెరిగిందని సీపీ పేర్కొన్నారు. ఈ ఏడాది మహిళలపై నేరాలు పెరిగాయన్నారు. మొత్తం 403 అత్యాచార కేసులు నమోదయ్యాయని తెలిపారు. పోక్సో కేసులు 12 శాతం తగ్గాయి. గతేడాది సైబర్‌ నేరాల ద్వారా రూ.82 కోట్ల మోసాలు జరగగా, ఈసారి అవి రూ.133 కోట్లకు చేరడం గమనార్హం. మొత్తానికి సైబర్ నేరాల ద్వారా బాధితులు నష్టపోయిన మొత్తం 2022తో పోలిస్తే 11శాతం పెరిగింది. 2023లో హత్యలు తగ్గినప్పటికీ, స్థిరాస్తులతో ముడిపడి ఉన్న నేరాలు 3 శాతం వరకూ పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.

ఇది కూడా చదవండి: న్యూ ఇయర్ వేడుకలపై సీపీ కఠిన ఆంక్షలు.. వారికి హెచ్చరికలు!

ఆర్థిక నేరాలపై గతేడాది 292 కేసులు నమోదవగా, ఈసారి 344కు పెరిగాయి. డ్రగ్స్‌ నిర్మూలనకు కట్టుదిట్టమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ ఏడాది పండుగలు, ర్యాలీలు, ఇతర కార్యక్రమాలన్నిటినీ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ ప్రశాంతంగా నిర్వహించిందన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు