Sun Set: సూర్యుడు అస్తమించని ప్రదేశాలు ఉన్నాయని మీకు తెలుసా?

సూర్యుడు లేని జీవనాన్ని ఊహించుకోగలరా? లేదా సూర్యుడు మాత్రమే ఉండి.. చీకటి లేని జీవితాన్ని గడపగలమా? అయితే, ప్రపంచవ్యాప్తంగా 70 కంటే ఎక్కువ రోజులు సూర్యుడు అస్తమించని ప్రదేశాలు ఉన్నాయని మీకు తెలుసా? ఆ ప్రాంతాలేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Sun Set: సూర్యుడు అస్తమించని ప్రదేశాలు ఉన్నాయని మీకు తెలుసా?

Sun Set: సూర్యుడు లేని జీవనాన్ని ఊహించుకోగలరా? లేదా సూర్యుడు మాత్రమే ఉండి.. చీకటి లేని జీవితాన్ని గడపగలమా? రోజుకు 24 గంటలు ఉంటాయి.. దాదాపు 12 గంటలు మనకి సూర్యకాంతి ఉంటుంది.. మిగిలిన గంటలని రాత్రి సమయమని పిలుస్తాం.. అయితే, ప్రపంచవ్యాప్తంగా 70 కంటే ఎక్కువ రోజులు సూర్యుడు అస్తమించని ప్రదేశాలు ఉన్నాయని మీకు తెలుసా? అవును మీరు విన్నది నిజమే.. ఈ ప్రాంతాలేంటో.. ఈ కథ ఏంటో తెలుసుకోండి!

Also Read: Coconut Water: కొబ్బరి బోండాం కొనేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తే.. మీ డబ్బులకు న్యాయం జరిగినట్లే..!

నార్వే

ఆర్కిటిక్ సర్కిల్‌లోని నార్వేని "ల్యాండ్ ఆఫ్ ది మిడ్‌నైట్ సన్" అని పిలుస్తారు. ఇక్కడ మే-జూలై చివరి వరకు సూర్యుడు అసలు అస్తమించడు. అంటే దాదాపు 76 రోజుల పాటు సూర్యుడు మాత్రమే కనిపిస్తాడు. ఏప్రిల్ 10-ఆగస్టు 23 వరకు సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తాడు.

నునావట్, కెనడా

కెనడాలోని వాయువ్య భూభాగాల్లో ఆర్కిటిక్ సర్కిల్‌కు రెండు డిగ్రీల ఎత్తులో నునావట్ ఉంది. ఈ ప్రదేశం రెండు నెలల పాటు సూర్యకాంతిని చూస్తుంది,. అయితే చలికాలంలో ఈ ప్రదేశం దాదాపు 30 రోజుల పాటు మొత్తం చీకటిని చూస్తుంది.

ఐస్‌లాండ్‌

ఐస్‌లాండ్ గ్రేట్ బ్రిటన్ తర్వాత యూరప్‌లో అతిపెద్ద ద్వీపం. ఇది దోమలు లేని దేశంగా కూడా ప్రసిద్ధి చెందింది. వేసవి కాలంలో.. ఐస్‌లాండ్‌లో రాత్రులు స్పష్టంగా ఉంటాయి. అయితే జూన్‌లో సూర్యుడు అస్తమించడు.

publive-image

బారో, అలాస్కా

మే చివరి నుంచి జూలై చివరి వరకు సూర్యుడు అస్తమించని ప్రాంతం అలాస్కాలోని బారో. మంచుతో కప్పబడిన పర్వతాలు, మంత్రముగ్దులను చేసే హిమానీనదాలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశాన్ని వేసవిలో లేదా శీతాకాలంలో సందర్శించవచ్చు.

ఫిన్లాండ్

వేల సరస్సులు, ద్వీపాలతో కూడిన భూమి ఫిన్లాండ్‌. ఇక్కవ వేసవిలో సూర్యుడు దాదాపు 73 రోజుల పాటు ప్రకాశిస్తూనే ఉంటాడు. అయితే, శీతాకాలంలో ఈ ప్రాంతం సూర్యరశ్మిని చూడదు. ఇక్కడ ప్రజలు వేసవిలో తక్కువ నిద్రపోవడానికి, శీతాకాలంలో ఎక్కువ నిద్రపోవడానికి ఇది కూడా ఒక కారణం.

Also Read: Earthquake: భూకంపం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. తప్పక తెలుసుకోండి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు