MLA Tellam: నేను అమ్ముడుపోలేదు.. కాంగ్రెస్ లో అందుకే చేరిన: భద్రాచలం ఎమ్మెల్యే సంచలన ఇంటర్వ్యూ

తాను అమ్ముడుపోలేదని.. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరానని అంటున్నారు భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావ్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతామధుకు సిగ్గు, లజ్జ ఉంటే భద్రాచలంకు ఏంచేశాడో చెప్పాలని సవాల్ విసిరారు. అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని తేల్చిచెప్పారు.

New Update
MLA Tellam: నేను అమ్ముడుపోలేదు.. కాంగ్రెస్ లో అందుకే చేరిన: భద్రాచలం ఎమ్మెల్యే సంచలన ఇంటర్వ్యూ

MLA Tellam Venkat Rao: భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావ్ RTV తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించారు. తాను అమ్ముడుపోలేదని.. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరానని అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతామధుకు సిగ్గు, లజ్జ ఉంటే భద్రాచలంకు ఏం చేశాడో చెప్పాలని సవాల్ విసిరారు. సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు లేంది తాతా మధుకేనని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని తేల్చిచెప్పారు.

Also Read: అనుచరుడి కోసం రంగంలోకి రేవంత్‌.. ఓ మెట్టు దిగి నేడు రాజగోపాల్ రెడ్డి ఇంటికి..

పొంగులేటే తన రాజకీయ గురువని చెప్పుకొచ్చారు. మంత్రి పొంగులేటితోనే చివరి వరకూ తన రాజకీయ ప్రయాణం ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పై విమర్శలు చేయదలుచుకోవట్లేదన్నారు. తాను ప్రజలకిచ్చిన మాటను నెరవేర్చాలంటే అధికారంలో ఉన్న పార్టీలో చేరితేనే సాధ్యమవుతుందన్నారు. భద్రాచలం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చి చెప్పారు. తనపై బీఆర్ఎస్ ఏ న్యాయపోరాటమైనా.. ఎంతవరకైనా చేయవచ్చన్నారు. ముగ్గురు మంత్రుల సహకారంతో భద్రాచలం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తీరుతానని ఛాలెంజ్ చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ కింది వీడియో చూడండి..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు