తాము అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి పథకం (Kalyanalaxmi Scheme) కింద రూ.లక్ష తో పాటు తులం బంగారం (Gold) కూడా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చెప్పిన విషయం తెలిసిందే. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ హామీ అమలు ఎప్పటినుంచనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఈ స్కీమ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీని కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: ప్రైవేట్ యూనివర్సిటీలకు రేవంత్ రెడ్డి వార్నింగ్.. అధికారులకు కీలక ఆదేశాలు!
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 7 తర్వాత పెళ్లి చేసుకున్న వారందరికీ ఈ పథకాన్ని వర్తించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ పథకం కింద రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. గత ప్రభుత్వ సమయంలో ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకున్న అనేక మంది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత వారు కూడా తమకు రూ.లక్షతో పాటు తులం బంగారం వస్తుందని ఆశించారు.
కానీ అనేక చోట్ల కేవలం రూ.లక్ష మాత్రమే అందిస్తున్నారు. దీంతో వారంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా రూ.లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలని ఆయా దరఖాస్తుదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.