Congress Malkajgiri MP Candidate: రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకొన్న కాంగ్రెస్ పార్టీ లోకసభ ఎన్నికల్లో (Lok Sabha Elections) సత్తా చాటాలని ప్రయత్నాలు ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించిన కొన్ని లోకసభ స్థానాల పరిధిలో విపక్ష బీఆర్ఎస్ , బీజేపీ కంటే తక్కువ సీట్లు వచ్చాయి. ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల ఇలాంటి ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలోని 17లోకసభ నియోజకవర్గాల్లో ఎంఐఎం ప్రాతినిథ్యం వహిస్తున్న హైదరాబాద్ ను మినహాయిస్తే మిగిలిన 16 స్థానాలకు గాను 9 స్థానాల్లో కాంగ్రెస్ కు 7 చోట్ల బీఆర్ఎస్ కు ఆధిక్య లభించింది. ఆధిక్యం లభించని స్థానంలో బలమైన అభ్యర్థులను దింపేందుకు ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ (Congress). దీనిలో భాగంగానే మల్కాజిగిరి లోకసభ స్థానానికి అభ్యర్థిని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది.
మల్కాజిగిరి ఎంపీ స్థానానికి పట్నం సునీతా మహేందర్ రెడ్డి (Sunita Mahender Reddy) పేరు దాదాపు ఖరారు అయినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపుగా ఆమె పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వర్యంలో మల్కాజిగిరి పై సమీక్ష జరిగింది. ఈసమావేశానికి ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. కాగా ఆ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నియమించిన ఇంచార్జీ తుమ్మల నాగేశ్వరరావు హాజరుకాలేదు. కాగా సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థి పేరును వెల్లడించికపోయినప్పటికీ..పట్నం సునీతా మహేందర్ రెడ్డి సీఎం రేవంత్ పక్కనే కూర్చుకోవడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరించింది. సునీతా మహేందర్ రెడ్డి ప్రస్తుతం వికారాబాద్ జడ్పీ ఛైర్మన్ గా ఉన్నారు.
ఇది కూడా చదవండి: పవన్ ఓటమే లక్ష్యం.. వైఎస్ జగన్ కీలక మీటింగ్!