AP: నందిగామ టీడీపీలో పోటా పోటీ.. మున్సిపల్ పీఠం కోసం ఎవరికి వారు ఏం చేస్తున్నారంటే..

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ పీఠం కోసం టీడీపీలో పోటా పోటీ నడుస్తోంది. ఛైర్మన్ పదవి తమకు కావాలి అంటే తమకు కావాలని నలుగురు కౌన్సిలర్లు లాబియింగ్ చేస్తున్నారు. ఛైర్మన్ వరలక్ష్మి, వైస్ ఛైర్మన్ నాగరత్నం అనారోగ్య కారణాలతో మృతిచెందగా రెండు వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి.

New Update
AP: నందిగామ టీడీపీలో పోటా పోటీ.. మున్సిపల్ పీఠం కోసం ఎవరికి వారు ఏం చేస్తున్నారంటే..

NTR District: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ పీఠం కోసం టీడీపీలో పోటా పోటీ నడుస్తోంది. ఛైర్మన్ పదవి తమకు కావాలి అంటే తమకు కావాలని నలుగురు కౌన్సిలర్లు లాబియింగ్ చేస్తున్నారు. తమకు ఒక చాన్స్ ఇవ్వాలని అధినాయకత్వాని కౌన్సిలర్లు ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం 20 మంది కౌన్సిలర్లకు గాను టీడీపీ 10 మంది కౌన్సిలర్లు బలంగా ఉన్నారు. ఛైర్మన్ వరలక్ష్మి, వైస్ ఛైర్మన్ నాగరత్నం అనారోగ్య కారణాలతో మృతి చెందగా రెండు వార్డుల్లో ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

గతంలో వైసీపీకి ఉన్న 13 మంది కౌన్సిలర్లలో ఐదుగురు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. టీడీపీ 10 జనసేన 1తో మున్సిపల్ ఛైర్మన్ టీడీపీ కౌవసం చేసుకునే అవకాశం ఉంది. పోటీలో 5 వార్డ్ కౌన్సిలర్ ఏచూరి రత్నకూమారి, 8 వార్డు కౌన్సిలర్ శాఖమూరి స్వర్ణ లత,10 వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణ కుమారి,14 వార్డు కౌన్సిలర్ కామసాని సత్యవతి పార్టీలో తమ కష్టాన్ని గుర్తించి తమకు చాన్స్ ఇవ్వాలని ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తోన్నారు.

ఇప్పటికే నందిగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కసరత్తు చేస్తున్నారు. దీంతో ఎవరికి మున్సిపల్ ఛైర్మన్ పదవి వరిస్తుందో అని కౌన్సిలర్లలో ఉత్కంఠ పెరుగుతోంది. ఛైర్మన్ బరిలో ఉన్న 4 కౌన్సిలర్లు మూడున్నర సంవత్సరాల ప్రతిపక్షంలో పనిచేసిన తీరు చూస్తే..

శాఖమూరి స్వర్ణ లత 2020 నందిగామ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి పోటీ చేసి 8 వార్డు కౌన్సిలర్ గా గెలిచారు. గతంలో నందిగామ సర్పంచ్ గా చేసిన అనుభవం ఉంది. నందిగామ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా ఉండి అధికార పక్షాన్ని నిలదీసి వారు చేసిన తప్పులను ఎండ గట్టడంలో ముందు ఉన్న సందర్భాలు లేకపోలేదు.

ఏచూరి రత్నకూమారి భర్త రాము పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పట్టణ అధ్యక్షుడు బాధ్యత తీసుకుని పార్టీని పట్టణంలో బలోపేతానికి కృషి చేశారు. నందిగామ పట్టణంలో ఉన్న ఓటర్లను స్థానిక నాయకులతో కలిసి నందిగామలో 4000 పైగా మైనస్ లో తెలుగు దేశం పార్టీ ని 2024 ఎన్నికల్లో 8000 ఓట్ల మెజారిటీ వచ్చేందుకు తన వంతు పాత్ర పోషించాడు.

కౌన్సిలర్ కామసాని సత్యవతి ఎప్పటి నుంచో టీడీపీలో కోనసాగుతూ 2020లో 14 వార్డు కౌన్సిలర్ పోటీ చేసి గెలిచారు. తన వయస్సు రిత్యా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని అందుచేత తనకు ఒక చాన్స్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. మండవ కృష్ణ కుమారి పార్టీ అధికారంలోకి రావడానికి తనవంతు ప్రయత్నం చేశారు. తన తోటి కోడలు వరలక్ష్మి చేసిన చైర్మన్ పదవిని మిగిలిన 18 నెలలకు తనకు ఒక చాన్స్ ఇవ్వాలని మండవ కృష్ణ కుమారి ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: ముచ్చుమర్రి వాసి అనుమానాస్పద మృతి.. బాలికపై హత్యాచారం కేసులో..

Advertisment
తాజా కథనాలు