Communication Skills: ఇతరులు ఏం చేశారాన్నది కాదు.. మనం ఎలా రియాక్ట్ అయ్యామన్నది ముఖ్యం బిగిలు!

రెస్పాండ్‌కి రియాక్షన్‌కి తేడా ఉంటుంది. రెస్పాండ్‌ అవ్వడం నేర్చుకుంటే అనేక సమస్యలు తీరినట్టే. రెస్పాండ్‌ అంటే ఆలోచించి రిప్లై ఇవ్వడం లేదా కూల్‌గా థింగ్‌ చేసి సమాధానం చెప్పడం. రియాక్ట్ అవ్వడమంటే అవతలి వాళ్లు చేసినదానికి వెంటనే ఆలోచించకుండా సమాధానం చెప్పడమని నిపుణులు చెబుతున్నారు. ఇతరులు మాట్లాడినదానికి వెంటనే బదులు ఇవ్వకుండా ఒక నిమిషం సైలెంట్‌గా ఉండి రిప్లై ఇవ్వడం బెటర్.

Communication Skills: ఇతరులు ఏం చేశారాన్నది కాదు.. మనం ఎలా రియాక్ట్ అయ్యామన్నది ముఖ్యం బిగిలు!
New Update

ఎవరైనా పదేపదే రెచ్చగొడుతున్నారా? అయితే రెచ్చిపోకండి.. కామ్‌గా ఉండండి. ట్రిగ్గర్ చేసేవాళ్లు ప్రతీచోటా ఉంటారు.. మనం ట్రిగ్గర్‌ అవ్వకుండా ఉండాలంతే. ఎందుకంటే కోపంతో అన్న మాట మళ్లి తిరిగిరాదు. దేనికైనా సమాధానం చెప్పాల్సి వస్తే ఆలోచించి రెస్పాండ్ అవ్వడం ముఖ్యం. రియాక్షన్‌ వద్దు. రెస్పాన్స్‌కి, రియాక్షన్‌కి తేడా ఉంటుంది. రెస్పాన్స్‌ అవ్వడం నేర్చుకోండి. రియాక్షన్‌ వద్దు. రెస్పాండ్‌ అవ్వడం అంటే ఆలోచించి అవ్వడం.. రియాక్ట్ అవ్వడం అంటే ఆవేశపడడం. ఎలా రెస్పాండ్‌ అవ్వలో మీ కోసం కొన్ని టిప్స్.

publive-image ప్రతీకాత్మక చిత్రం

పాజ్: ఇతరులు మాట్లాడినదానికి వెంటనే బదులు ఇవ్వకుండా ఒక నిమిషం సైలెంట్‌గా ఉండండి. కన్వర్‌జేషన్‌ టైమ్‌లో పాజ్‌లు అవసరం. పాజ్ చేయడానికి కొంత సమయం కేటాయించండి. తర్వాత రెస్పాండ్‌ అవ్వండి. ఈ కొంచెం గ్యాప్‌ మనకి మెంటల్‌ పీస్‌ ఉండేలా చేస్తుంది.

బ్రీత్‌: లోతుగా శ్వాస తీసుకోండి. ఇది మీ భావోద్వేగాలను శాంతపరుస్తాయి. అప్పుడు మరింత హేతుబద్ధంగా ఆలోచించగలుగుతారు. వెంటనే రియాక్ట్ అయితే రేషనల్‌గా మాట్లాడలేం. ఆ సమయంలో నోటికి వచ్చింది మాట్లాడుతాం. దీన్ని వల్ల మనం కన్వే చేయాల్సింది చేయలేం.

అనేక కోణాల నుంచి పరిస్థితిని పరిగణించండి. అవతలి వ్యక్తి ఎందుకు అలా మాట్లాడుతున్నారో కూడా థింక్‌ చేయండి. వారి భావాలు, ప్రేరణలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు ఎలా రెస్పాండ్‌ అవ్వలో తెలుస్తుంది.

పదాలు: బయటకు అన్న మాట మళ్లి తిరిగిరాదు. ఎలాంటి పదాలు మాట్లాడుతున్నామన్నది ముఖ్యం. కొంతమంది ఎక్కడపడితే అక్కడ బూతులు మాట్లాడుతుంటారు. ఇది అసలు కరెక్ట్ కాదు. ఇతురులకు సమాధానం చెప్పడం కన్నా ఎలా చెబుతున్నామన్నది ముఖ్యం. అందుకే ఒకటికి రెండు సార్లు ఆలోచించి పదాలను ఉపయోగించండి

అవతలి వ్యక్తి భావాలు లేదా ఆందోళనల పట్ల సానుభూతి చూపించండి. వారి భావాల పట్ల అవగాహన ఉండడం కూడా ముఖ్యం. ఇది ఇద్దరి మధ్య గొడవలను తగ్గించడంలో సహాయపడుతుంది.

publive-image ప్రతీకాత్మక చిత్రం

సొలూష్యన్స్: సమస్య గురించి పదేపదే చర్చిస్తూ రియాక్ట్ అవ్వడం కంటే.. ఆ సమస్యకు సంబంధించిన సొలూష్యన్‌ని ఫైండ్‌ అవుట్ చేసి రెస్పాండ్‌ అవ్వడం ముఖ్యం. మీరు ఇచ్చిన సొలూష్యన్‌ వారికి నచ్చకపోతే రాజీ కోసం ప్రయత్నించండి.

అభిప్రాయాన్ని కోరండి: ఇతర వ్యక్తి ఇన్‌పుట్ లేదా ఫీడ్‌బ్యాక్‌ని అడగండి. ఇది ఓపెన్‌ కమ్యూనికేషన్‌కి దారి తీస్తుంది. అప్పుడు మనం ఆలోచించి మాట్లాడవచ్చు. మంచి టైమ్‌ ఉంటుంది.

వినడం నేర్చుకోండి: సరైన విధంగా రెస్పాండ్‌ అవ్వడానికి ముందు అవతలి వాళ్లు చెప్పేది వినాలి. మాట్లాడడం కంటే వినడం ముఖ్యం. ముందు వినడం రావాలి. అప్పుడే రెస్పాండ్ అవుతాం. లేకపోతే ఆవేశపడి రియాక్ట్ అవుతాం.

అనుభవం: అనుభవాల నుంచి నేర్చుకోవడం ముఖ్యం.

ALSO READ: బిర్యానీ లవర్స్‌కు షాక్‌.. ఈ మేటర్‌ తెలుసుకుంటే మైండ్‌ బ్లాక్..!

#communication-skills
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe