Gas Price: గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలెండర్ ధరలు.. వారికి మాత్రమే!

దేశంలో ఈరోజు నుంచి కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర తగ్గుతుంది. చమురు కంపెనీలు గ్యాస్ ధరను సిలెండర్ కు 72 రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. హైదరాబాద్ లో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ రూ.1903లు గా ఉంది. 14 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ రూ.853లతో నిలిచింది

New Update
Gas Price: గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలెండర్ ధరలు.. వారికి మాత్రమే!

Gas Price:  దేశీయ చమురు సంస్థలు గుడ్ న్యూస్ చెప్పాయి. దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరను భారీగా తగ్గించినట్టు ప్రకటించాయి. వాణిజ్యపరంగా వినియోగించే గ్యాస్ సిలెండర్ ధరలు ఈరోజు నుంచి 72 రూపాయల మేర తగ్గాయి. ఈ తగ్గింపు తరువాత హైదరాబాద్ లో 19 కేజీల గ్యాస్ సిలెండర్ ధర రూ.1903లు గా ఉంది.  ఇదిలా ఉండగా వంటింటి గ్యాస్ ధరల్లో ఏ మాత్రం మార్పు లేదు. కమర్షియల్ గ్యాస్  సిలెండర్ ధరలు తగ్గడం వలన హోటళ్లు, క్యాంటీన్ల యజమానులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇక వంటింటి  గ్యాస్ ధరలు హైదరాబాద్ లో 14 కేజీల సిలెండర్ కు రూ.853ల వద్ద స్థిరంగా ఉంది.

దేశంలో వివిధ ప్రాంతాల్లో గ్యాస్ ధరలు ఇలా ఉన్నాయి..

  • ఢిల్లీలో ధర ఇప్పుడు రూ.69.50 తగ్గి రూ.1676కి చేరుకుంది. ఇంతకుముందు రూ.1,745.50కి లభించేది.
  • కోల్‌కతాలో, ఈ సిలిండర్ ఇప్పుడు రూ. 1787కి అందుబాటులో ఉంది, రూ. 72 తగ్గింది.  అంతకుముందు దీని ధర రూ. 1859.
  • ముంబైలో సిలిండర్ ధర రూ.1698.50 నుంచి రూ.69.50 తగ్గి రూ.1629కి చేరింది.
  • చెన్నైలో రూ.1840.50కి సిలిండర్ అందుబాటులో ఉంది.
  • అయితే 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
  • ఇది ఢిల్లీలో ₹ 803, కోల్‌కతాలో ₹ 829, ముంబైలో ₹ 802.50 మరియు చెన్నైలో ₹ 818.50కి అందుబాటులో ఉంది.

చమురు కంపెనీలు గ్యాస్ ధరలను ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ ధరలలో మార్పులు చేర్పులు చేస్తుంటాయి.

Also Read: గుడ్‌న్యూస్.. అంచనాకు మించి జీడీపీ వృద్ధి రేటు సాధించిన భారత్

విమాన ప్రయాణం చౌకగా మారవచ్చు
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మెట్రోలలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలను తగ్గించాయి. దీనివల్ల విమాన ప్రయాణాన్ని చౌకగా చేయవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం, ఢిల్లీలో ATF కిలోలీటర్‌కు (1000 లీటర్లు) రూ. 6,673.87 తగ్గి రూ. 94,969.01కి చేరుకుంది. చెన్నైలో ఏటీఎఫ్ కిలోలీటర్‌కు రూ.7,044.95 తగ్గి రూ.98,557.14కి చేరింది.

Advertisment
తాజా కథనాలు