Bhadram Comedian: స్నానం ఇలా అస్సలు చేయొద్దు.. కమెడియన్ డా.భద్రం సంచలన విషయాలు!

డాక్టర్ అయిన కమెడియన్ భద్రం ఆరోగ్యానికి సంబందించిన వీడియోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా స్నానం ఎలా చేయాలి అనే అంశం పై మాట్లాడుతూ ఓ వీడియో చేశారు. పూర్తి వివరాల కోసం పైన హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Bhadram Comedian: స్నానం ఇలా అస్సలు చేయొద్దు.. కమెడియన్ డా.భద్రం సంచలన విషయాలు!

Bhadram Comedian: కమెడియన్ భద్రం చాలా మందికి ఒక నటుడిగా పరిచయం.. కానీ ఈయన ఒక డాక్టర్. వెల్ నెస్ ట్రైనర్ గా ప్రజలు ఆరోగ్యాంగా ఉండటానికి తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా భద్రం సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో ఆయన స్నానం ఎలా చేయాలి అనే విషయం పై మాట్లాడారు.. స్నానం ఎలా చేయాలో కూడా చెప్పాలా అని మాత్రం అనుకోకండి.. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి లేదంటే మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదం జాగ్రత్త..
ఇది కూడా చదవండి: Deepfake : ఏంటీ డీప్‎ఫేక్ వీడియోలు..వీటిని ఎలా తయారు చేస్తారు? నకిలీ, అసలును గుర్తించడం ఎలా?

వీడియోలో డాక్టర్ భద్రం మాట్లాడుతూ.. సాధారణంగా తల స్నానం చేసేటప్పుడు నేరుగా తల పై నుంచి పోసుకోకూడదని తెలిపారు. అలా డైరెక్ట్ గా నీళ్లు తల పై పోయడం వల్ల తల భాగంలో రక్తప్రసరణ ఎక్కువవుతుంది.. దాని వల్ల బ్రెయిన్ స్ట్రోక్, పెరలాసిస్ వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్పాడు. అందుకే స్నానం చేసేటప్పుడు ముందుగా కాళ్ళు తడపాలి, తర్వాత శరీర భాగం, ఆ తర్వాత తల భాగం తడిచేలా చేయాలని చెప్పారు. దీనికి ఆయన ఒక చక్కటి ఉదాహరణ కూడా ఇచ్చారు.. మనం నదిలో స్నానం చేసేటప్పుడు కూడా ముందుగా కాళ్ళు లోపల పెడతాము..

ఆ తర్వాత మెల్లిగా శరీర భాగం లోపలికి వెళ్తుంది. దాని తర్వాత తలను లోపలి ముంచుతాము అలాగే స్నానం కూడా ఇదే పద్దతిలో చేస్తే ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. ఆసక్తికరంగా ఉండడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. కానీ, ఏమైందో తెలియదు కానీ.. భద్రం ఈ వీడియోను తన రీల్స్ ఖాతా ఉంచి తొలగించారు. అనుకోకుండా వీడియో డిలీట్ అయ్యాందా? లేక కావాలనే తొలగించాలరా? అన్న అంశంపై ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు భద్రం.

ఇదిలా ఉంటే.. భద్రం డాక్టర్ గానే కాదు కమెడియన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో భద్రంకు కమెడియన్‌గా గుర్తింపు వచ్చింది. ‘మార్నింగ్ ముగ్గేస్తుంటే.. ముగ్గుచిప్పతో సహా ఎత్తుకొచ్చేశాను’ అంటూ భద్రం చెప్పే డైలాగులు అందరినీ నవ్వించాయి. ఆ తర్వాత మహానుభావుడు, శతమానం భవతి, ప్రతిరోజూ పండగే’ వంటి 100 కు పైగా చిత్రాల్లో నటించారు.

Also Read: Almonds: బాదం పప్పును నానబెట్టకుండా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు!

Advertisment
Advertisment
తాజా కథనాలు